కళాకారులను గౌరవించడం అభినందనీయం
ABN , Publish Date - Aug 02 , 2025 | 11:29 PM
కళలను, సంప్రదాయాలను సజీవంగా ఉంచుతున్న కళాకారులను గౌరవించడం అభినందనీయమని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
- ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
వెల్దండ, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి) : కళలను, సంప్రదాయాలను సజీవంగా ఉంచుతున్న కళాకారులను గౌరవించడం అభినందనీయమని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. శనివారం పెద్దాపూర్ గ్రామంలో మార్కెట్ డైరెక్టర్ కేశమళ్ల కృష్ణ తన పుట్టినరోజును పురస్కరించుకుని పలువురు కళాకారులకు డప్పులను సమకూర్చగా ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై కళాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా పుట్టినరోజు కేక్‌ను కట్‌చేసి కృష్ణను సన్మానించారు. అంతకుముందు స్థానికంగా ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి నారాయణరెడ్డి పూలమాలలువేసి నివాళులర్పించారు. అనంతరం మండలకేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు మోతీలాల్ జన్మదిన వేడుకలో ఎమ్మెల్యే పాల్గొని అభినందించారు. కార్యక్రమంలో నాయకులు మట్ట వెంకటయ్యగౌడ్, భూపతిరెడ్డి, హరికిషన్, రషీద్, పురుషోత్తమాచారి, శ్రీనుయాదవ్, లాలు, శ్రీనునాయక్, వెంకటేష్, పర్వత్‌రెడ్డి, పుల్లయ్య తదితరులు ఉన్నారు.