Hepatitis from Roadside Pani Puri: ప్రాణం మీదకి తెచ్చిన పానీపూరి
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:51 AM
పానీపూరి ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. రోడ్డు పక్కన ఓ బండి వద్ద పానీపూరి తిని అక్కడి నీళ్లు తాగడంతో..
రోడ్డు పక్కన పానీపూరి తిని ఆస్పత్రిపాలైన ఐటీ ఉద్యోగి
హెపటైటి్‌స-ఏ బారిన పడి నెల పాటు ఆస్పత్రిలో చికిత్స
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పానీపూరి ఓ యువకుడి ప్రాణాల మీదికి తెచ్చింది. రోడ్డు పక్కన ఓ బండి వద్ద పానీపూరి తిని అక్కడి నీళ్లు తాగడంతో హెపటైటి్‌స-ఏ బారినపడి నెల రోజులు పాటు ఆస్పత్రిపాలయ్యాడు. హైదరాబాద్ ఎల్బీనగర్ ప్రాంతానికి చెందిన ఓ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్(22) తీవ్ర అస్వస్థతతో ఆస్టర్ ప్రైమ్ ఆస్పత్రికి నెల రోజుల క్రితం వచ్చాడు. వైద్యులు ఆరా తీయగా... అక్కడికి రెండు వారాల క్రితం రోడ్డు పక్కన బండి వద్ద పానీపూరి తిని అక్కడి డబ్బాలోని నీటిని తాగినట్టు చెప్పాడు. రక్త పరీక్షలు చేయగా హెపటైటిస్ ఏ తీవ్రంగా ఉండటమే కాక కాలేయం ఎంజైములు పెరిగినట్టు, యాంటీ-హెచ్‌ఏవీ ఐజీఎం యాంటీబాడీలు పాజిటివ్ అని తేలినట్టు ఆ ఆస్పత్రి గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ కలువల హర్షతేజ తెలిపారు. దీంతో 4 వారాల చికిత్స అనంతరం కాలేయం పరిస్థితి మెరుగుపడి రోగి