Share News

‘ఎత్తిపోతలు’ ముగిసినట్లేనా...?

ABN , Publish Date - Jun 30 , 2025 | 11:01 PM

హాజీపూర్‌ మండలంలోని పడ్తనపల్లిలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఎత్తిపోతల పథకానికి ఆదిలోనే హంస పా దు పడగా, కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా చొరవ తీసుకోవా లనే విజ్ఞప్తులు ఆయకట్టు రైతుల నుంచి వినిపిస్తు న్నా యి.

‘ఎత్తిపోతలు’ ముగిసినట్లేనా...?

-హాజీపూర్‌ మండలంలో బీఆర్‌ఎస్‌ హయాంలో నిర్మాణానికి హామీ

-రూ. 80.50 కోట్ల అంచనా వ్యయంతో ప్రణాళిక

-పరిపాలనా అనుమతుల జారీతోనే సరి

-పనులకు అప్రూవల్‌ ఇవ్వని కేసీఆర్‌ సర్కారు

-కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా చొరవ చూపాలని వేడుకోలు

మంచిర్యాల, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): హాజీపూర్‌ మండలంలోని పడ్తనపల్లిలో గత ప్రభుత్వ హయాంలో మంజూరైన ఎత్తిపోతల పథకానికి ఆదిలోనే హంస పా దు పడగా, కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా చొరవ తీసుకోవా లనే విజ్ఞప్తులు ఆయకట్టు రైతుల నుంచి వినిపిస్తు న్నా యి. బీఆర్‌ఎస్‌ హయాంలో ఎత్తిపోతల పథకానికి రూ పకల్పన జరుగగా, పరిపాలన అనుమతుల జారీ తోనే సరిపెట్టారు. పడ్తనపల్లి వద్ద గోదావరి బేసిన్‌లో కడెం కెనాల్‌ డిస్ట్రిబ్యూటరీ 42పై ఎత్తిపోతల పథకం నిర్మాణా నికి ఇరిగేషన్‌ అధికారులు రూపలక్పన చేశారు. మంచి ర్యాల నియోజకవర్గ అప్పటి ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌ రావు ఎత్తిపోతల పథక నిర్మాణం పట్ల ప్రత్యేక చొరవ తీసుకుని కేసీఆర్‌ ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తి చే శారు. దీంతో పథకానికి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో హాజీ పూర్‌, లక్షెట్టిపేట మండలాల రైతుల్లో ఆనందం వెల్లివి రిసింది. పథకం నిర్మాణం జరిగితే చివరి ఆయకట్టు వ రకు నీరంది పంటలు బాగా పండుతాయని గంపె డాశ పెట్టుకున్నారు. అయితే రైతుల ఆశలపై నీళ్లు చ ల్లుతూ కేసీఆర్‌ సర్కారు ఎత్తిపోతల పథకానికి మం గళం పాడింది.

గూడెం ఎత్తిపోతలకు కొనసాగింపుగా....

మంచిర్యాల దండేపల్లి మండలంలో ఉన్న గూడెం లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు కొనసాగింపుగా హాజీపూర్‌ మండలం పడ్తనపల్లి వద్ద గోదావరిపై ఎత్తిపోతల పథకానికి రూ ప కల్పన చేశారు. గూడెం గ్రామం వద్ద 3 టీఎంసీల సామర్థ్యంతో రూ. 125 కోట్ల వ్యయంతో నిర్మించిన ప థకం ద్వారా దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్‌ మండ లాల్లో సుమారు 40వేల ఎకరాలకు సాగు నీరందించా ల్సి ఉంది. అయితే లిఫ్ట్‌ తరుచుగా మొరాయించడంతో ఆ లక్ష్యం నెరవేరడం లేదు. లిఫ్ట్‌కు అమర్చిన రెండు మోటార్లలో ఏదో ఒకటి తరుచుగా మొరాయించడం వంటి సమస్యల కారణంగా గూడెం లిఫ్ట్‌పై ఆధారపడ్డ ఆయకట్టు రైతులు ఇబ్బందులు పడేవారు. దీన్ని దృష్టి లో ఉంచుకొని గూడెం లిఫ్ట్‌కు కొనసాగింపుగా పడ్తన పల్లి ఎత్తిపోతల పథకానికి రూప కల్పన చేశారు. గూ డెం లిఫ్ట్‌ను దండేపల్లి, లక్షెట్టిపేట మండలాలకు పరి మితం చేసి హాజీపూర్‌, లక్షెట్టిపేట ఆయకట్టుకు పడ్త నపల్లి లిఫ్ట్‌ నుంచి సాగునీరు ఇవ్వాలని నిర్ణయించారు.

డీపీఆర్‌ ఇలా...

ఎల్లంపల్లి ప్రాజెక్టు పరిధిలో పడ్తనపల్లి లిఫ్ట్‌ ఇరిగే షన్‌ కోసం నీటిపారుదల శాఖ ఇంజనీర్లు డిటెయిల్డ్‌ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్‌)ను రూపొందించారు. ఇందు లో భాగంగా రూ. 83.51 కోట్ల అంచనా వ్యయాన్ని త యారు చేయగా, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ. 80.50 కో ట్లకు పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. పథకంలో భాగంగా రెండు లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి జి ల్లాలోని హాజీపూర్‌, లక్షెట్టిపేట మండలాల్లోని సుమారు ఎనిమిది వేల ఎకరాల చివరి ఆయకట్టుకు నీరందించే లా రూప కల్పన చేశారు.

ప్రారంభం కాని పనులు...

పడ్తనపల్లి ఎత్తిపోతల పథకానికి బీఆర్‌ఎస్‌ ప్రభు త్వం పరిపాలనా అనుమతులకే పరిమితం చేసింది. లిఫ్ట్‌ ఇరిగేషన్‌కు సంబంధించి రూ. 80.50 కోట్లకు పరి పాలనా అనుమతులు మంజూరు చేస్తూ 22-11-2022 న అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రజ త్‌కుమార్‌ జీవోఆర్టీ నెంబర్‌ 349 జారీ చేశారు. అయితే నిధులు మంజూరు కాకపోవడంతో పనులు ప్రారం భానికి నోచుకోలేదు. ఇదిలా ఉండగా 2023 జూన్‌ 9న జిల్లా పర్యటనకు వచ్చిన అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ తో లిఫ్ట్‌కు శంకుస్థాపన చేయిస్తారనే ప్రచారం జోరుగా జరిగింది. జిల్లాలో పర్యటించిన కేసీఆర్‌ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయగా, ఆ జాబితాలో ప డ్తనపల్లి లిఫ్ట్‌కు చోటు లభించలేదు. పడ్తనపల్లి ఎత్తిపో తల పథకం మంజూరైతే తమ పంటలకు సాగునీరు అందుతుందని ఆశపడ్డ ఆయకట్టు రైతుల ఆశలు ఆది లోనే ఆడియాశలయ్యాయి. కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా ప డ్తనపల్లి లిఫ్ట్‌ ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

Updated Date - Jun 30 , 2025 | 11:01 PM