Share News

సహకారం లేనట్టేనా..

ABN , Publish Date - Aug 17 , 2025 | 10:51 PM

రాష్ట్ర వ్యా ప్తంగా సహకార సంఘాల పదవీకాలం ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. అదే సమయంలో రైతులకు వెన్నుదన్నుగా ఉం డే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏ సీఎస్‌) విస్తరణపైనా ప్రభుత్వం దృష్టిసారిస్తోంది.

సహకారం లేనట్టేనా..

సంఘాల ఎన్నికలు మరోసారి వాయిదా

-పీఏసీఎస్‌ల పదవీకాలం ఆరు నెలలు పొడగింపు

-ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

-సంఘాల విస్తరణపైనా సర్కారు దృష్టి

-కొత్త మండలాల్లో ఏర్పాటుకానున్న పీఏసీఎస్‌లు

మంచిర్యాల, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యా ప్తంగా సహకార సంఘాల పదవీకాలం ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చే సింది. అదే సమయంలో రైతులకు వెన్నుదన్నుగా ఉం డే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏ సీఎస్‌) విస్తరణపైనా ప్రభుత్వం దృష్టిసారిస్తోంది. రైతు లకు పంట రుణాలు, రాయితీపై విత్తనాలు, ఎరువులు అందిస్తూ అండగా నిలవడం సహకార సంఘాల విధి. గత బీఆర్‌ఎస్‌ హయాంలో జిల్లాలో కొత్త సహకార సంఘాల ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చినా...అవి బు ట్టదాఖలు కావడంతో విస్తరణకు నోచుకోలేదు. కొత్తవి ఏర్పాటు చేయకపోయినా...కనీసం ఉన్నవాటిని కూడా బలోపేతం చేయకపోవడంతో రైతులకు వాటి సేవలు అంతంత మాత్రంగానే అందుతున్నాయి. ప్రస్తుతం ఉ న్న ప్రాథమిక సంఘాల పరిధి ఎక్కువగా ఉండటం తోపాటు గ్రామాలకు దూరంగా ఉండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. జిల్లాలో కొత్తగా ఏర్పాటైన మండలాల్లో సహకార సంఘాలు లేకపోవడంతో ఆ యా మండలాల రైతులు ఇతర మండలాల్లోని సొసైటీ లకు వెళ్లాల్సి వస్తోంది. ఇదిలా ఉండగా జిల్లాలో కొన్ని సొసైటీల పరిధిలో ఎక్కువ గ్రామాలు ఉండగా, మరికొ న్ని సొసైటీలకు తక్కువ గ్రామాలు ఉన్నాయి. దీంతో దూరంగా ఉన్న సొసైటీలకు వివిధ పనుల నిమిత్తం వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

విస్తరణపైనా ప్రభుత్వం దృష్టి..

రాష్ట్రం ఏర్పాటైన తరువాత జిల్లాలు, మండలాల పునర్విభజన జరిగిన అనంతరం ఆ మేరకు రైతులకు సహకార సేవలను మరింతగా పెంచేందుకు అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం సహకార సంఘాల విస్తరణ చేప ట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు సహకార శాఖ అధి కారులకు ఆదేశాలు కూడా జారీ చేసింది. అధికారులు క్షేత్రస్థాయిలో అద్యయనం చేసి, గ్రామాల్లో సభలు నిర్వ హించి రైతుల అభిప్రాయాలను కూడా సేకరించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న సహకార సంఘాలకు అద నంగా ఎన్ని అవసరం అవుతాయో అంచనా వేసి ప్రతి పాదనలు తయారు చేశారు. సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి పంపారు. దీంతో సహకార సంఘాల వి భజనకు రంగం సిద్దం కాగా, డ్రాఫ్టు నోటిఫికేషన్‌ కూడా జారీ అయింది. సంఘాల విభజనే తరువాయి అనుకుం టున్న తరుణంలో ప్రభుత్వ నిర్ణయం మరుగున పడిం ది. 2020 ఫిబ్రవరి 15న ప్రభుత్వం సహకార ఎన్ని కల ను నిర్వహించింది. ఎన్నికల సమయంలోనే సంఘాల ను విస్తరించాలని ప్రతిపాదించగా, కేసీఆర్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విస్తరణ ప్రక్రియ ముందుకు సాగలేదు. అయితే రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకున్న కాంగ్రెస్‌ సర్కారు పీఏసీఎస్‌లను విస్తరిం చాలనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు ఈ నెల 14న ఉత్తర్వులు సైతం జారీ చేసింది.

నూతన సహకార విధానానికి మంగళం....

సహకార సంఘాల ఏర్పాటుకు సంబంధించి గతం లో కేంద్ర ప్రభుత్వం ఒక జాతీయ సహకార విధానాని కి శ్రీకారం చుట్టింది. దీని ప్రకారం ప్రతి గ్రామానికి ఒక ప్రాథమిక సహకార సంఘం, ఒక మత్స్య సహకార సం ఘం, ఒక పాల ఉత్పత్తి సహకార సంఘం ఉండాలనే ది ఈ నూతన సహకార విధానం ఉద్దేశ్యం. కేంద్ర స హకార శాఖ మంత్రిగా అమిత్‌షా బాధ్యతలు చేపట్టి న తరువాత ఏర్పాటు చేసిన జాతీయ సహకార సద స్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. నూతన వి ధానాన్ని అనుసరించాలని రాష్ట్రాలకు కూడా అమిత్‌ షా సూచనలు చేశారు. గత ప్రభుత్వం దీన్ని పెద్దగా పట్టించుకోవడంతో నూతన విధానానికి మంగళం పా డినట్లయింది. ఈ విషయంలో ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభు త్వం సానుకూలంగా స్పందించడంతో సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

విభజింపుతోనే సేవలు విస్తృతం...

వ్యవసాయంలో రైతులకు అన్ని రకాలుగా వెన్నుద న్నుగా ఉండే సహకార సంఘాల సేవలను విస్తరిస్తుం డటంతో మరింతగా ప్రయోజనం కలుగుతుందనే అభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం కొత్తగా 5వే ల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి ఏ ఈవోలను నియమించింది. అదే తరహాలో రైతులకు అందుబా టులో ఉండేలా సొసైటీలను కూడా విభజించే నిర్ణయా నికి రావడం గమనార్హం. ఒక్కో సొసైటీలో వేలాది మంది రైతులు సభ్యులుగా ఉండగా, ఏ అవసరం వచ్చినా క్యూలు కట్టాల్సి వస్తోంది. ప్రతి సీజన్‌ ఆరంభంలో ఎ రువులు, విత్తనాల కోసం రైతులు బారులు తీరిన సంద ర్భాలు అనేకం ఉన్నాయి. జిల్లాలో ప్రస్తుతం 21 ప్రాథ మిక వ్యవసాయ సహకార సంఘాలు ఉండగా, వాటి పదవీ కాలం వాస్తవంగా 2025 ఫిబ్రవరి 15 తో ముగి సింది. దీంతో ప్రభుత్వం ఆరు నెలలపాటు గడువు పొ డిగించింది. ఆ గడువు కూడా ఈ నెల 15తో ముగిసిం ది. దీంతో ప్రభుత్వం ఎన్నికలకు వెళ్లకుండా మరోమారు ఆరు నెలల పాటు పదవీకాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. సహకార సంఘాల ఎన్నికలకు ముందుగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం ఉంది. ఈ కారణంగా సహకార సంఘాల పదవీ కాలా న్ని పెంచుతూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రభుత్వం సహకార సంఘాలను విస్తరించాలనే నిర్ణయానికి వచ్చి నందున జిల్లాలో మరో 16 సంఘాలు కొత్తగా ఏర్పా టయ్యే అవకాశం ఉంది. అప్పుడు జిల్లాలోని రైతులకు సహకార సంఘాల సేవలు సైతం విస్తరించే అవకా శాలు మెండుగా ఉన్నాయి.

Updated Date - Aug 17 , 2025 | 10:51 PM