Share News

సిమెంటు పరిశ్రమలకు ప్రోత్సాహమేదీ...?

ABN , Publish Date - Nov 01 , 2025 | 11:10 PM

ఉమ్మడి జిల్లాలోని సిమెంటు పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లేక యాజమాన్యాలు అల్లాడుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలను మూసి వేయగా మరికొన్ని ప్లాంట్‌ల యాజమాన్య మార్పిడి జరిగింది. సిమెంటు తయారీకి ముడి సరుకు అయిన సున్నపు రాయి నిల్వ లు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పుష్కలంగా ఉన్నప్ప టికీ కర్మాగారాలు స్థాపించేందుకు వ్యాపారులు ముం దుకు రాకపోవడంతో ఇక్కడి యువతకు ఉద్యోగావకా శాలు లభించడం లేదు.

సిమెంటు పరిశ్రమలకు ప్రోత్సాహమేదీ...?

ఉమ్మడి జిల్లాలో పుష్కలంగా సున్నపురాయి నిల్వలు

ఇప్పటికే పలు కంపెనీల మూసివేత

రోడ్డున పడుతున్న వే లాది మంది కార్మికులు

దేవాపూర్‌ ప్లాంటు యాజమాన్యం మార్పు

మంచిర్యాల, నవంబరు 1 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలోని సిమెంటు పరిశ్రమలకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లేక యాజమాన్యాలు అల్లాడుతున్నాయి. ఇప్పటికే పలు కంపెనీలను మూసి వేయగా మరికొన్ని ప్లాంట్‌ల యాజమాన్య మార్పిడి జరిగింది. సిమెంటు తయారీకి ముడి సరుకు అయిన సున్నపు రాయి నిల్వ లు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పుష్కలంగా ఉన్నప్ప టికీ కర్మాగారాలు స్థాపించేందుకు వ్యాపారులు ముం దుకు రాకపోవడంతో ఇక్కడి యువతకు ఉద్యోగావకా శాలు లభించడం లేదు. ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం కరువై సిమెంటు కర్మాగారాలు మూసివేతకు గురవు తుండగా, వాటిలో పని చేసే కార్మికులు రోడ్డున పడుతున్నారు.

పుష్కలంగా నిల్వలు...

సిమెంటు తయారీకి ముడి వనరు అయిన సున్నపు రాయి నిల్వలకు ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా పెట్టింది పేరు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాసిపేట మండలం దే వాపూర్‌, హాజీపూర్‌ మండలం ర్యాలీ ఘడ్‌పూర్‌, తిర్యా ణి మండలం కెరమెరితోపాటు ఆదిలాబాద్‌, బేల మం డలాల్లోని ఏజెన్సీ ప్రాంత గుట్టల్లో సున్నపు రాయి ని ల్వలున్నాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాసిపేట మండలం దేవాపూర్‌లో ఒకే ఒక్క సిమెంట్‌ పరి శ్రమ కార్మికులకు ఉపాధి కల్పిస్తోంది. నాలుగైదేళ్ల క్రి తం వరకు మంచిర్యాల జిల్లా కేంద్రంలో మంచిర్యాల సిమెంట్‌ కంపెనీ (గతంలో ఏసీసీ కంపెనీగా ప్రసిద్ది) లో ఉత్పత్తి జరుగగా, ఆ కంపెనీపై ఆధారపడి వేలాది కుటుంబాలు ఉపాధి పొందాయి. మంచిర్యాల సిమెం టు కంపెనీలో ఉత్పత్తికి అవసరమైన సున్నపు రాయి హాజీపూర్‌ మండలంలోని ర్యాలీ గ్రామంలో ఉన్న గు ట్టల నుంచి సేకరించేవారు. రిజర్వు ఫారెస్టులో క్వారీలు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి ప్రత్యేక రోప్‌ వే ద్వారా ముడి సరుకును ప్లాంట్‌కు తరలించేవారు. సున్నపు రాయి తవ్వేందుకు కంపెనీ యాజమాన్యానికి 2019 వరకు లీజ్‌ అనుమతులు ఉండగా, అంతకు ముందే యాజమాన్యం ఉద్దేశ్యపూర్వకంగా ఉత్పత్తి నిలిపివేసే పన్నాగాలు పన్నింది. ఇదిలా ఉంగా కాసిపేట మండ లం దేవాపూర్‌లోని ఓరియంట్‌ సిమెంటు కంపెనీకీ కూడా అవరమైన ముడి సరుకును ఏజెన్సీ ప్రాంతం లోని దేవాపూర్‌, ర్యాలీ గఢ్‌పూర్‌, కెరమెరి గుట్టల నుం చి తెలంగాణ రాష్ట్ర మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరే షన్‌ (టీఎస్‌ఎండీసీ) ద్వారా పొందేది. ప్రస్తుతం దేవా పూర్‌ సిమెంట్‌ కంపెనీకి సుమారు మరో 15 సంవత్సరాల వరకు సున్నపు రాయి తరలించే లీజ్‌ అనుమతులు ఉన్నాయి.

పలు కంపెనీలు మూసి వేత.....

ప్రభుత్వ ప్రోత్సాహం కరువై ఇప్పటికే ఉమ్మడి జి ల్లాలో పలు సిమెంటు కర్మాగారాలు మూసివేతకు గురయ్యాయి. ఆదిలాబాద్‌లోని ప్రభుత్వ రంగ సంస్థ అయి న సీసీఐ (సిమెంట్‌ కంపెనీ ఆఫ్‌ ఇండియా) దాదాపు 20 ఏళ్ల కిత్రం మూతపడగా ఆసిఫాబాద్‌ మండలం దంతెన పల్లిలోని అన్నపూర్ణ సిమెంట్స్‌, సోమేశ్వర సి మెంటు కంపెనీలు శాశ్వతంగా మూతపడ్డాయి. కొము రం బీం ప్రాజెక్ట్‌ నిర్మాణం కారణంగా సోమేశ్వర, అన్న పూర్ణ సిమెంటు కంపెనీలు మూసివేతకు గురయ్యాయి. సున్నపు రాయి వెలికి తీయడం మూలంగా ప్రాజెక్‌ ్టకు నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతోపాటు పర్యావరణ సమస్యల కారణంగా పై రెండు కంపెనీల నిర్వహణకు అటంకం కలిగింది. అటవీ ప్రాంతంలో సున్నపురాయి తవ్వకాలకు సంబంధించి అనుమతులకు ప్రభుత్వ ప రంగా ఆటంకాలు ఎదురు కావడంతో రెండు కంపెనీల మూసివేత అనివార్యం అయింది. దేవాపూర్‌ ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ గతంలో బిర్లా యాజమాన్యం కిం ద పని చేస్తుండేది. ఇటీవల అది కూడా యాజమాన్యంమార్పిడి జరిగి ఆదాని గ్రూప్‌లోకి వెళ్లింది.

మూసివేతకు గురైన ఎంసీసీ...

అత్యంత ఘణమైన చరిత్ర గల మంచిర్యాల సిమెం టు కంపెనీ (గతంలో ఏసీసీ)ని యాజమాన్యం నష్టాల పేరుతో నిరవధికంగా మూసివేసింది. సున్నపురాయి లీ జు గడువు ఇంకా మిగిలి ఉండగానే కంపెనీ మూసి వే తకు రంగం సిద్ధం చేసిన యాజమాన్యం, క్రమంగా కా ర్మికుల సంఖ్యను తగ్గిస్తూ వచ్చింది. ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లేక కర్మాగారాన్ని మూసివేసేందుకే మొగ్గు చూపుతున్నట్లు యాజమాన్యం తెలిపినప్పటికీ ఆ నిర్ణయం వెనుక స్వ లాభమే ఉన్నట్లు అప్పట్లో కార్మికులు ఆరోపించారు. గ తంలో ఏసీసీ(ది అసోసియేటెడ్‌ సిమెంట్‌ కంపెనీస్‌) లి మిటెడ్‌ పేరుతో దశాబ్దాల కాలంపాటు ఉత్పత్తి సాఽ ధించిన కంపెనీని తదనంతరం స్థానికంగా కొందరు కొనుగోలు చేసి కొంతకాలంపాటు నడిపించారు. అప్ప ట్లో కంపెనీని ఏసీసీ యాజమాన్యం విక్రయించగా వందలాది మంది కార్మికులు రోడ్డున పడ్డారు. ప్రభుత్వ పరంగా అనుమతులు లభించకపోవడం ఒక కారణమై తే, ప్లాంటులో జరిగిన కొన్ని చర్యల కారణంగా అభ ద్రాతా భావనకు గురైన ఏసీసీ యాజమాన్యం కంపె నీని సమూలంగా విక్రయించాలనే నిర్ణయానికి వచ్చిన ట్లు ప్రచారం జరిగింది. ఈ కంపెనీలో గ్రేడ్‌-1 పోర్ట్‌ ల్యాండ్‌ సిమెంటు ఉత్పత్తి అవుతుండగా దేశంలోనే అత్యంత దృఢమైన సిమెంటును ఉత్పత్తి చేయడంలో కంపెనీ అగ్రస్థానంలో నిలిచింది.

నూతన కంపెనీల ఏర్పాటు ఏది..?

జిల్లాలో సున్నపు రాయి నిల్వలు పుష్కలంగా ఉన్న ప్పటికీ నూతన కంపెనీల ఏర్పాటుకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. నూతన సిమెంటు కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లభించదని భావిస్తున్నందువల్లే వ్యాపారులు ముందుకు రావడంలేదని తెలుస్తోంది. నూతన కంపెనీలను ఏర్పాటు చేస్తే సున్నపు రాయి సేకరణకు అటవీ శాఖ అనుమతులు లభించడం కష్టతరంగా ఉంటుందని వ్యాపారులు అభి ప్రాయపడుతున్నారు. దీంతో పాటు కాలుష్యం పేరిట ప్రజల నుంచి వ్యతిరేకత రావడం కూడా నూతన కర్మాగారాల ఏర్పాటుకు ఆటంకంగా మారింది. దశాబ్ధాలపా టు సిమెంటు ఉత్పత్తి చేసినా తరగని సున్నపు రాయి నిల్వలు ఉన్నప్పటికీ కార్మాగారాల స్థాపనకు మొగ్గు చూపకపోవడం గమనార్హం. ఒకవేళ ప్రభుత్వపరంగా ప్రోత్సాహం లభిస్తే కొంత కంపెనీలు ఏర్పాటయ్యే అవ కాశం ఉండగా, నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశా లు కూడా లభించనున్నాయి.

Updated Date - Nov 01 , 2025 | 11:10 PM