Share News

చెన్నూర్‌ వరకు సాగునీరు అందించాలి

ABN , Publish Date - Oct 04 , 2025 | 11:26 PM

కడెం ప్రాజెక్టు నుంచి చెన్నూర్‌ వర కు ఆయకట్టు ద్వారా పంటలకు సాగునీరు అందించాలని కడెం పునర్నిర్మాణ ఉద్యమ వ్యవస్ధాకుడు గాదె శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్‌లో రైతులతో కలిసి కడెంప్రాజెక్టు ఆధునికీకరణ ఉద్యమానికి శనివారం శ్రీకారం చేపట్టారు.

 చెన్నూర్‌ వరకు సాగునీరు అందించాలి
సమావేశంలో మాట్లాడుతున్న కడెం పునర్నిర్మాణ ఉద్యమ వ్యవస్ధాకుడు గాదె శ్రీనివాస్‌

కడెం పునర్నిర్మాణ ఉద్యమ వ్యవస్థాకుడు గాదె శ్రీనివాస్‌

దండేపల్లి అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): కడెం ప్రాజెక్టు నుంచి చెన్నూర్‌ వర కు ఆయకట్టు ద్వారా పంటలకు సాగునీరు అందించాలని కడెం పునర్నిర్మాణ ఉద్యమ వ్యవస్ధాకుడు గాదె శ్రీనివాస్‌ డిమాండ్‌ చేశారు. దండేపల్లి మండలం నెల్కివెంకటాపూర్‌లో రైతులతో కలిసి కడెంప్రాజెక్టు ఆధునికీకరణ ఉద్యమానికి శనివారం శ్రీకారం చేపట్టారు. ఏర్పాటు చేసిర సమావేశంలో ఆయన మా ట్లాడుతూ తలపున గోదావరి పారుతున్న ఈప్రాంత రైతాంగానికి సాగునీరు అందని పరిస్థితి ఉందన్నారు. కడెం ప్రాజెక్టు పునర్నిర్మాణం చేపట్టి చెన్నూర్‌ వరకు సాగునీరు అందించాలన్నారు. 1963లో శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ప్రారం భోత్సవం సందర్భంగా అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఇచ్చిన వాగ్ధానం మేరకు కాలువ నిర్మాణం చేపట్టడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి. దీంతో 1987లో అప్పటిఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నందమూరి తారకరామ రావు ఎన్‌టీఆర్‌ హాజీపూర్‌ మండలం పెద్దంపేట వద్ద మందాకి కాలువకు శం కుస్థాపన చేశారని, అది ఇప్పటి వరకు పూర్తి కాలేదన్నారు. కడెం నుంచి చె న్నూర్‌ వరకు సాగునీరు అందించాలంటే మొదటగా కడెం ప్రాజెక్టును ఆధు నికీకరణ చేపట్టాలన్నారు. కడెం ప్రాజెక్టు నుంచి హాజీపూర్‌ మండలం వరకు సాగునీరు అందించడం గగనంగా మారిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభు త్వం కడెం ప్రాజెక్టు ఆధునికీకరణపై ప్రత్యేక దృష్టి చెపట్టాలన్నారు. అప్పటి ప్రధాని, సీఎం హమీలను అమలు చేయాలని కోరారు. ఇప్పటికైన ప్రభుత్వం రైతాంగాన్ని అదుకోనేందుకు ప్రత్యేక దృష్టి సారించి కడెం జలాశయంను ఆధునికీకరించి చెన్నూర్‌ వరకు సాగుసీరు అందించాలన్నారు. లేని పక్ష్యంలో కడెం ప్రాజెక్టును ఆధునికీకరించే వరకు ఆయకట్టు రైతులతో ఉద్యమ పోరాటం చేస్తామన్నారు.

Updated Date - Oct 04 , 2025 | 11:26 PM