kumaram bheem asifabad- ఇంటి నంబరు కేటాయింపులో అక్రమాలు
ABN , Publish Date - Oct 10 , 2025 | 10:49 PM
కాగజ్‌నగర్ మున్సిపాలిటీలొ ఇంటి నంబర్ల కేటాయింపు అక్రమ దందా కొనసాగుతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు మీనమేషాలెక్కిస్తుండడంతో కింద స్థాయి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో ఈ విషయంలో పట్టణానికి చెందిన పలువురు జిల్లా స్థాయి అధికారులతో పాటు వరంగల్ ఆర్‌జేడీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. కేవలం విచారణ జరిపారు.
- ఫిర్యాదులు చేసినా చర్యలు కరువు
కాగజ్‌నగర్, అక్టోబరు 10 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ మున్సిపాలిటీలొ ఇంటి నంబర్ల కేటాయింపు అక్రమ దందా కొనసాగుతోంది. పట్టించుకోవాల్సిన అధికారులు మీనమేషాలెక్కిస్తుండడంతో కింద స్థాయి సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారు. గతంలో ఈ విషయంలో పట్టణానికి చెందిన పలువురు జిల్లా స్థాయి అధికారులతో పాటు వరంగల్ ఆర్‌జేడీకి లిఖిత పూర్వకంగా ఫిర్యాదులు చేశారు. కేవలం విచారణ జరిపారు. ఇంటి నంబర్లు కేటాయించిన వారిపై ఎలాంటి చర్యలు చేపట్టక పోవడం చర్చనియాంశమైంది. ఇదే అదనుగా భావించిన కొంత మంది దళారులతో ఈ వ్యవహారం నడిపించి నిబంధనలకు విరుద్ధంగా ఇంటి నంబర్లను కేటాయిస్తున్నారు. ఇంటి నంబర్ల కేటాయింపు తర్వాత ఎలాంటి ఫిర్యాదులు రాక పోవడంతో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకొని అమ్మకాలు సాగించి సొమ్ము చేసుకుంటున్నారు. కాగజ్‌నగర్ మున్సిపాలిటీకి చెందిన మెంగినేని లక్ష్మి తనకు ఇంటి నంబరు కేటాయింపు ఇప్పుడు వివాదస్పదమైంది. 2022లో ఇంటి నంబరు కోసం దరఖాస్తు చేసుకోగా, అప్పటి అధికారులు ఇందుకు అసెస్‌మెంటు నంబరు 1097014860ను కేటాయించారు. పలు ఫిర్యాదులు రావడంతో ఈ నంబరును రద్దు చేశారు. తాజాగా మళ్లీ ఇంటి నంబరు కేటాయింపు చేయడం ఇప్పుడు కొత్త అసెస్‌మెంట్ 109 7016096 కేటాయిస్తు ఉత్తర్వులు ఇచ్చారు. గతంలో ఇంటి నంబరును రద్దు చేసిన తర్వాత తాజాగా మళ్లీ ఎలా కేటాయించారన్న విషయంలో పలువురు వరంగల్ రీజినల్ డైరెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు మున్సిపాలిటీ నుంచి ఎన్ని నంబర్లు కేటాయించారు. నిబంధను పాటించారా అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చర్యలు చేపట్టాలని పలువురు డిమాండు చేశారు. కాగజ్‌నగర్ పట్టణానికి చెందిన జగదీష్ అనే వ్యక్తికి సంబంధించి ఖాళీ స్థలంలో 2022లో మున్సిపాల్టీ నుంచి ఇంటి నంబరు కేటాయించారు. తమ భూమిలో ఎలా ఇంటి నంబర్లు కేటాయిస్తారని నేరుగా ము న్సిపల్ ఆర్‌జేడికి ఫిర్యాదు చేశారు. దీనిపై కూడా విచారణ జరిగింది. ఆ తర్వాత ఇంటి నంబర్లను రద్దు చేశారు.
- మున్సిపల్ కార్యాలయం ఎదుట..
కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట గల ఖాళీ స్థలం తమదేనని ఇంటి నంబరు కేటాయించాలని లక్ష్మి అనే మహిళ అలాగే 2022లో దరఖాస్తు చేసుకున్నది. అధికారులు ఇంటి నంబరు కేటాయించారు. వాస్తవంగా ఈ భూమి మున్సిపాలిటీది కావ డం విశేషం. స్థానిక నాయకులు సీడీఎంఎ అధికారి హైదరాబాద్ వారికి ఫిర్యాదు చేయడంతో పూర్తి విచారణ జరిపి వీటిని రద్దు చేశారు. అనంతరం మున్సిపల్ అధికారులు ఖాళీ స్థలం మున్సిపాల్టీదని బోర్డు పెట్టడం గమనార్హం. ఇంత జరుగతున్నా కూడా ఇంటి నంబర్ల కేటాయింపుపై విచారణ జరిపి అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై ఎందుకు చర్యలు తీసుకోవడం పట్టణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ దందాపై గట్టి నిఘా పెట్టి నిబంధనలు పాటించని అధికారులపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కోరుతు న్నారు. ఈ విషయమై మున్సిపల్ కమిషనర్ రాజేందర్‌ను వివరణ కోరగా ఇంటి నంబర్ల కేటాయింపుపై తాము నిబంధనల మేరకే చేస్తున్నామని తెలిపారు.