Share News

kumaram bheem asifabad- కనిపించని అభివృద్ధి వెలుగులు

ABN , Publish Date - Dec 27 , 2025 | 10:04 PM

కుమ రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాసులకు 2025 ఎన్నో తీపి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ఏడాది ఆసిఫాబాద్‌ జిల్లాలో సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందగా మారింది.

kumaram bheem asifabad- కనిపించని అభివృద్ధి వెలుగులు
లోగో

- పూర్తి కాని ప్రధాన వంతెనలు

- రోడ్ల నిర్మాణంపై పట్టింపు కరువు

- సమస్యల వలయంలో వసతిగృహాలు

ఆసిఫాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): కుమ రం భీం ఆసిఫాబాద్‌ జిల్లా వాసులకు 2025 ఎన్నో తీపి చేదు జ్ఞాపకాలను మిగిల్చింది. ఈ ఏడాది ఆసిఫాబాద్‌ జిల్లాలో సమస్యలు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందగా మారింది. జిల్లా లో దాదాపు అన్ని మండలాలు ఆదివాసీ ప్రాంతాలే కావడంతో మౌలిక సదుపాయాలపై ప్రభుత్వం ఈ ఏడాది కూడా శీతకన్నె వేసిందని చెప్పాలి. దీంతో జిలా అభివృద్ధికి నోచుకోవడం లేదు.

- వర్షాధారమే సాగుకు..

జిల్లా రైతాంగానికి దశాబ్దాలుగా వర్షాధారమే సాగు దిక్కవుతోంది. ఏళ్లుగా ప్రధాన ప్రాజెక్టులు అన్ని పెండింగ్‌లో ఉండడంతో సాగులో పెద్దగా మార్పు జరగడం లేదు. సరైన సాగునీటి వసతి లేక వేలాది ఎకరాల భూమి నిరుపయోగంగా మారుతుంది. గత్యంతరం లేక ఆరుతడి పంటలతో సరిపెట్టాల్సిన పరిస్థితి నెలకొన్నది. చివరి వానస్తే పంట లేకుంటే లేదు అన్న చందంగా మారుతోంది. అన్నదాతలు పూర్తిగా వర్షాదార పంటలపై ఆధార పడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. ప్రాజెక్టులు పూర్తై సక్రమంగా నీరం దిస్తే తప్ప సాగు పండుగలా మారే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఉన్నప్పటికీ అవి పెండింగ్‌లోనే ఉన్నాయి. ప్రధానంగా కుమరం భీం ప్రాజెక్టు, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టు నిర్మా ణ పనులు పూర్తి స్థాయిలో కాలేదు. అదే విధంగా వట్టివాగు, చెలిమెల వాగు ప్రాజెక్టు కాలువలు మరమ్మతులకు నోచుకోవడం లేదు.ప్రభుత్వం జిల్లాలో సాగునీటి ప్రాజెకులకు నిధులు మంజూరు చేయకపో వడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోతున్నారు.

- తీరని రవాణా కష్టాలు..

గ్రామాలకు రవాణా కష్టం తీర్చేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి పూర్తిస్థాయిలో చేరడం లేదు. మారు మూల గ్రామాల ప్రజలు ఇప్పటికి కష్టాలు పడుతు న్నారు. కాలంతో కుస్తీ పడుతూ సమస్యల సుడి గుండంలో చిక్కుకొని కొట్టుమిట్టాడుతున్నారు. ఈ నేప థ్యంలో జిల్లాలోని ఆయా మండలాల్లోని గ్రామాలలో నిర్మిస్తున్న వంతెన నిర్మాణ పనులు దశాబ్దాలుగా కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని పెద్దవా గుపై గుండి వంతెన నిర్మాణ పనులు దశాబ్దన్నర కాలం పాటు కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుండి గ్రామానికి వర్షాకాలంలో వెళ్లడానికి ప్రజలు అవస్థలు పడుతు న్నారు. కెరమెరి మండలంలోని అనార్‌పల్లి-కరంజివా డ, లక్మాపూర్‌ వంతెనల నిర్మాణ పనులు అసంపూ ర్తిగానే ఉన్నాయి. కాగజ్‌నగర్‌- వాంకిడి మండలాల మధ్య కనర్‌ గాం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు 15 ఏళ్లు గడుస్తున్నా నేటికి అసంపూర్త్తిగానే ఉంది. తిర్యాణి మండలంలోని నాయకపుగూడ గ్రామం నుం చి దుగ్గపూర్‌ గ్రామానికి వెళ్లేందుకు మధ్యలో ఉన్న వంతెన అసంపూర్తిగా ఉండడంతో ప్రజలకు ఏటా వర్షకాలంలో అవస్థలు పడాల్సి వస్తోంది.

- రహదారుల నిర్మాణంపై..

రహదారులు అభివృద్ధికి కేంద్ర బిందువులు. అలాం టి కీలకమైన వ్యవస్థే జిల్లాలో అతీగతి లేని పరిస్థితి. ఏజెన్సీ ప్రాంతమైన కుమరం భీం జిల్లాలో నేటికీ 449 గిరిజన గ్రామాలు రోడ్డు సౌకర్యానికి నోచుకోవడం లేదు. ఏటా రోడ్ల నెట్‌వర్క్‌ను మెరుగు పరిచేందుకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్న ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాలపై శీత కన్ను వేయ డం ఇక్కడి ప్రజలకు శాపంగా పరిణమిస్తోంది. జిల్లాలో 15 మండలాల్లోనూ సగానికి సగం గ్రామా లకు రోడ్డు సౌకర్యం లేని పరిస్థితి ఇక్కడి నిర్లక్ష్యాన్ని పట్టి చూపుతోంది. ఇక వర్షాకాలం వచ్చిందటే చాలు జిల్లాలోని ఏజెన్సి గ్రామాలలో దుర్భర పరిస్థితి ఉత్పన్నమవుతాయి. వాగులు, ఒర్రెలు ఉప్పొంగి ప్రవ హించినప్పుడల్లా గిరి గ్రామాలు బాహ్య ప్రపంచానికి దూరంగా రోజుల తరబడి ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సిర్పూర్‌ నియోజకవర్గ పరిధిలోని దహెగాం, పెంచికలపేట, కౌటాల మండలంలోని కొన్ని గ్రామాలలో రోడ్‌ నెట్‌వర్క్‌ అత్యంత దయనీయంగా ఉంది. ఆసిఫాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని ఆసిఫాబాద్‌, కెరమెరి, జైనూర్‌, వాంకిడి, సిర్పూర్‌(యు), లింగాపూర్‌, తిర్యాణి మండలాల్లో ఇంచుమించు ఇదే పరిస్థితి. రోడ్ల నెట్‌వర్క్‌ను మెరుగు పరిచేందుకు ప్రజాప్రతినిధులు ప్రతిపాదనలు ఇస్తున్నా ప్రభుత్వం నిధులు మంజూరు చేయక పోవడం వల్ల ఈ పరిస్థితి నెలకొంటున్నది. ప్రధానంగా అధికార యంత్రాం గం కూడా జనాభా అధికంగా ఉన్న గ్రామాలకు ప్రాధాన్యం ఇస్తూ తక్కువ ప్రజలు ఉన్న గిరిజన గూడాలు, తండాలను విస్మరిస్తున్న ట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ఏజెన్సీ మండలాలో రోడ్ల నిర్మాణా లకు అటవీ అనుమతులు అడ్డంకిగా మారాయి. మెజార్టీ గ్రామాలకు సరైన రోడ్డు సౌకర్యం లేక పోవడం, అంతర్గత రోడ్ల వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నా పరిస్థితి నెలకొని ఉంది. ఇక ఏజెన్సీ మండలాలైన జైనూర్‌, సిర్పూర్‌(యు), లింగాపూర్‌ మండలాల్లోని గిరిజన గూడాలకు వర్షాకాలంలో రోడ్డు సౌకర్యం మూసుకుపోయి బాహ్యప్రపంచంతో వారాల తరబడి సంబంధాలు తెగిపోయే పరిస్థితులు ఇప్పటికీ ఉన్నాయి.

- అరకొర వసతులు..

జిల్లాలోని గురుకులాలు, వసతి గృహాల్లో అరకొర వసతులు మాత్రమే ఉన్నాయి. వసతి గృహలు, గురుకులాలకు సరిపడా భవనాలు నిర్మించకపోవడం తో నేటికి కొన్ని గురుకులాలు అద్దె భవనాల్లో అరకొర వసతుల మధ్య నెట్టుకు రావాల్సిన పరిస్థితి నెలకొంది. ఉన్న సొంత భవనాల్లో కూడ సమస్యలు రాజ్యమేలు తున్నాయి. భవనాలు శిధిలావస్థకు చేరుకొవడం, గదులు సరిపొక పోవడంతో విద్యార్థుల అవస్థలు అంత ఇంత కావు. ఇక మరుగుదొడ్లు, మూత్రశాలలు కూడా విద్యార్థుల సంఖ్యకు అనుగు ణంగా లేకుండా పోయాయి. కొన్ని చోట్ల ఉపయోగంలో లేకపోవడం మరికొన్ని చోట్ల శిధిలావస్థకు చేరుకోవడంతో విద్యా ర్థులు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. ఉన్నవి కూడ నిర్వహణ లోపంతో కంపు కొడుతూ వికారం పుట్టిస్తు న్నాయి. గురుకులాలకు వసతి గృహలకు విద్యార్థులకు వేడి నీళ్లందించేందుకు మంజూరు చేసిన సొలార్‌ వాటర్‌ హీటర్లు చేడిపోయి మరమ్మతుల కు నోచుకొక నిరుపయోగంగా ఉండడంతో విద్యార్థులు చన్నీటితోనే స్నానాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి. హాస్టళ ్లలోని పరిసరాలు పూర్తిగా గడ్డి, పిచ్చి మొక్కలతో ఏపుగా పెరిగి పోయాయి. డ్రైనేజీలు లేకపో వడంతో మురుగునీరు ఆ పరిసరాల్లో నిలువ ఉండి కంపు కొడుతున్నాయి. దీంతో దోమలు విపరీతంగా వృద్ధి చెంది విద్యార్థులు జ్వరాల బారిన పడుతున్నారు.

Updated Date - Dec 27 , 2025 | 10:04 PM