FGG urged CM Revanth Reddy: మల్కాజిగిరి నర్సింహస్వామి ఆలయ భూములపై విచారణ జరిపించాలి
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:49 AM
హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి జయగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ భూములను ఒక కాంట్రాక్టరు పేరు మీద రిజిస్టర్ చేసిన వ్యవహారంపై సమగ్ర...
హైదరాబాద్ నగరంలోని మల్కాజిగిరి జయగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయ భూములను ఒక కాంట్రాక్టరు పేరు మీద రిజిస్టర్ చేసిన వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎ్‌ఫజీజీ) కోరింది. ఎఫ్‌జీజీ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాశారు. 2003లో ఈ భూములను ఓ కాంట్రాక్టర్‌కు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారని లేఖలో తెలిపారు. దీనిపై విజిలెన్స్ డైరెక్టర్ జనరల్ విచారణ జరిపి, 2014లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారని, అధికారులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ సూచించారని వివరించారు. అయితే నాటి ప్రభుత్వం ఆ నివేదికను పక్కన పెట్టిందని, ఇప్పుడు ఆ భూముల్లో భవన నిర్మాణాలు మొదలయ్యాయని, సమగ్ర విచారణ జరిపించి, ఆలయ భూములను పరిరక్షించాలన్నారు.