Share News

Real Estate Scam: రూ.4లక్షల పెట్టుబడికి గుంట భూమి.. నెలకు 16 వేల వడ్డీ!

ABN , Publish Date - Dec 02 , 2025 | 05:44 AM

రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో పెట్టుబడులు పెడితే భారీగా సొమ్ము తిరిగొస్తుందని మభ్యపెట్టిన మరో సంస్థ బోర్డు తిప్పేసింది. ఒకసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే..

Real Estate Scam: రూ.4లక్షల పెట్టుబడికి గుంట భూమి.. నెలకు 16 వేల వడ్డీ!
Real Estate Scam

  • అధిక రాబడుల ఆశ చూపించి బోర్డు తిప్పేసిన 12 వెల్త్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌

  • నల్లగొండలో బాధితుల ఆందోళన

నల్లగొండ క్రైం, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): రియల్‌ ఎస్టేట్‌ వెంచర్‌లో పెట్టుబడులు పెడితే భారీగా సొమ్ము తిరిగొస్తుందని మభ్యపెట్టిన మరో సంస్థ బోర్డు తిప్పేసింది. ఒకసారి రూ.4 లక్షలు పెట్టుబడి పెడితే.. ఒక గుంట భూమి, 25 నెలల పాటు నెలకు రూ.16 వేల వడ్డీ, ఆ గడువు ముగియగానే రూ.8 లక్షలు నగదు ఇస్తామని ఘరానా మోసానికి పాల్పడింది. కానీ కొంత మందికే వడ్డీ చెల్లించడం, రిజిస్ట్రేషన్‌ చేసిన భూమి ఏదీ చూపకపోవడంతో.. మోసపోయామని గుర్తించిన బాధితులు సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలో ఆందోళనకు దిగారు. గతంలో ఇదే సంస్థపై సైబరాబాద్‌ పరిధిలోని ఆర్థిక నేరాల విభాగం (ఈవోడబ్ల్యూ)లో కేసు నమోదవడం గమనార్హం.


రూ.330కోట్లకు పైగా వసూళ్లు?

రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో 12 వెల్త్‌ క్యాపిటల్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరిట సంస్థ ఏర్పాటైంది. అధిక వడ్డీ, ప్రతిఫలం ఆశచూపడంతో సాధారణ వ్యక్తులతోపాటు కొందరు ఉద్యోగులు, అధికారులు కూడా ఇందులో పెట్టుబడులు పెట్టినట్టు సమాచారం. ఇరు తెలుగు రాష్ట్రాల్లో సుమారు రూ.330 కోట్ల వరకు ఈ సంస్థ సేకరించినట్టు బాధితులు చెబుతున్నారు. సంగారెడ్డి జిల్లా ఆందోల్‌ మండలం రాంసాగర్‌పల్లిలో ఉన్న భూములకు బై నంబర్లు వేసి వంద రూపాయల బాండ్‌ పేపరుపై గుంట భూమి చొప్పున రిజిస్ట్రేషన్‌ చేస్తున్నట్టుగా ఒప్పంద పత్రాలు (అగ్రిమెంట్‌) ఇచ్చారని, కానీ అవి నకిలీవని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


ఈ సంస్థ ఏజెంట్లు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 300మందికిపైగా ఈ స్కీమ్‌లో చేర్పించారు. అందులో కొందరికే వడ్డీ చెల్లించడం, రిజిస్ట్రేషన్‌ చేసిన గుంట భూమిని చూపించకపోవటంతో జిల్లాలోని బాధితులు ఈ సంస్థకు లీగల్‌ అడ్వైజర్‌గా పనిచేస్తున్న రాపోలు ప్రకాశ్‌ ఇంటివద్ద సోమవారం ఆందోళనకు దిగారు. పోలీసులు అక్కడికి చేరుకుని, ప్రకాశ్‌ను టూటౌన్‌ పోలీ్‌సస్టేషన్‌కు తీసుకెళ్లారు. దీనితో బాధితులు పోలీ్‌సస్టేషన్‌ వద్దకు వెళ్లి తమకు న్యాయం చేయాలంటూ సాయంత్రం వరకు నిరసన తెలిపారు. తమకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌కు ఫిర్యాదు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Students suicide at Bachupalli: బాచుపల్లిలో ఇద్దరు ఇంటర్ విద్యార్థుల సూసైడ్.!

India-Srilanka: శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. 'ఆపరేషన్ సాగర్ బంధు' పేరిట సహాయకచర్యలు

Updated Date - Dec 02 , 2025 | 10:27 AM