Medical Colleges: ఇంటర్ లోకల్ క్యాడర్ బదిలీలకు ఓకే
ABN , Publish Date - Dec 18 , 2025 | 02:50 AM
జీవో నంబరు 317 బాధిత ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ ఉప సంఘం సిఫారసుల మేరకు వైద్యవిద్య సంచాలకుల పరిధిలో..
జీవో 317 బాధితులు, డీఎంఈ పరిధిలోని వారికే..
హైదరాబాద్, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): జీవో నంబరు 317 బాధిత ఉద్యోగుల సమస్యలపై ఏర్పాటు చేసిన క్యాబినెట్ ఉప సంఘం సిఫారసుల మేరకు వైద్యవిద్య సంచాలకుల పరిధిలో ఇంటర్-లోకల్ క్యాడర్ తాత్కాలిక బదిలీలు, డిప్యూటేషన్స్‌కు అనుమతినిస్తూ డీఎంఈ నరేంద్ర కుమార్ సర్క్యులర్ జారీ చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ వైద్య కాలేజీలు, నర్సింగ్ కాలేజీలు, బోధనాస్పత్రుల ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల వ్యక్తిగత సమస్యలను దృష్టిలో పెట్టుకుని రెండేళ్ల పాటు తాత్కాలిక బదిలీలను డిప్యూటేషన్ పద్ధతిలో అనుమతించనున్నారు. 317 బాధిత ఉద్యోగులు ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఎంఈ సర్క్యులర్‌లో కోరారు. కాగా, తాత్కాలిక బదిలీలు కేవలం ఖాళీలున్న క్యాడర్లలోనే అమలు చేస్తారు. గరిష్ఠంగా మూడేళ్ల వరకే అవకాశముంటుంది. గడువు పూర్తయితే వెంటనే ఆ ఉద్యోగి తన సొంత క్యాడర్‌కు తప్పనిసరిగా వెళ్లాలి.