kumaram bheem asifabad- ముమ్మరంగా వరి నాట్లు
ABN , Publish Date - Aug 24 , 2025 | 11:17 PM
జిల్లాలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలస్యంగా కురిసిన వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులోకి నీరు చేరింది. దీంతో ఆయకట్టులో వరినాట్లు ముమ్మమరంగా కొనసాగుతున్నాయి. కూలీలు, రైతులకు వ్యవసాయ పనుల్లో బీజీ అయిపోయారు. ఇప్పటికే నారు పోసి భారీ వర్షాలు కురిస్తే నాట్లు వేసేందుకు అన్నదాతలు సిద్ధం చేశారు. జిల్లాలో 15 మండలాల్లో పరిధిలో ప్రాజెక్టులు, ఎరువులు, కుంటలు ఆలస్యంగా కురిసిన వర్షాలకు నిండుకొని జలకళను సంతరించుకున్నాయి.
- కూలీలకు పెరిగిన డిమాండ్
దహెగాం, ఆగస్టు 24 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో వరినాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆలస్యంగా కురిసిన వర్షాలతో చెరువులు, ప్రాజెక్టులోకి నీరు చేరింది. దీంతో ఆయకట్టులో వరినాట్లు ముమ్మమరంగా కొనసాగుతున్నాయి. కూలీలు, రైతులకు వ్యవసాయ పనుల్లో బీజీ అయిపోయారు. ఇప్పటికే నారు పోసి భారీ వర్షాలు కురిస్తే నాట్లు వేసేందుకు అన్నదాతలు సిద్ధం చేశారు. జిల్లాలో 15 మండలాల్లో పరిధిలో ప్రాజెక్టులు, ఎరువులు, కుంటలు ఆలస్యంగా కురిసిన వర్షాలకు నిండుకొని జలకళను సంతరించుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా 58 వేల ఎకరాల్లో రైతులు వరి పంటను సాగు చేస్తున్నట్లు వ్యవసాయాధికారులు అంచనా వేశారు. జిల్లాలో దహెగాం మండలంలోనే అత్యధికంగా 9,800 ఎకరాల్లో వరి సాగు అవుతుందని చెబుతున్నారు. వ్యవసాయ పంపు సెట్లలో వరి నాట్లు పూర్తి కావస్తున్నాయి. దహెగాం మండలంలో 2,024 వ్యవసాయ పంపు సెట్ల విద్యుత్ కనెక్షన్‌లు ఉన్నాయి. ఆలస్యంగా కురిసిన వర్షాలతో ప్రాజెక్టు, చెరువు లు కింద వరి నాట్లు పెంచుతూ వరి నార్లు వేయడానికి రైతులు సిద్ధమవుతున్నారు. పొలం చదును చేసే పనులు, వీల్స్ కొట్టే పనులు గట్లు తొక్కే పనులు చకచక సాగుతు న్నాయి. ఇదే సమయంలో కూలీలు రైతులకు చేతినిండ పనులు ఉండడంతో బిజీబిజీగా గడుపుతు న్నారు. మండలంలోని గిరివెల్లి, గెర్రె, చంద్రపల్లి, హత్తిని, కుంచవెల్లి గ్రామాల నుంచి కూలీలు ప్రైవేటు వాహనాల్లో ఇరత ప్రాంతాలకు నాటు వేసేందుకు వెళుతున్నారు.