ముమ్మరంగా వ్యవసాయ పనులు
ABN , Publish Date - Jun 27 , 2025 | 11:37 PM
వానా కాలం పంటల సాగు పనులు జోరందుకున్నాయి. వ్యవసాయ పనులతో రైతులు, కూలీలు బీజీగా ఉన్నారు. అడపత డపా కురుస్తున్న వర్షాలకు పంట చేన్లను దున్ని విత్త నాలు విత్తే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి.
జిల్లాలో 3.18 లక్షల ఎకరాల్లో సాగు...
అందుబాటులో ఎరువులు, విత్తనాలు...
నస్పూర్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి) : వానా కాలం పంటల సాగు పనులు జోరందుకున్నాయి. వ్యవసాయ పనులతో రైతులు, కూలీలు బీజీగా ఉన్నారు. అడపత డపా కురుస్తున్న వర్షాలకు పంట చేన్లను దున్ని విత్త నాలు విత్తే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. వా నా కాలం సీజన్‌లో జిల్లాలో పత్తి, వరి, మొక్క జొన్న, కంది, పెసర, మినుములు తదితర పంటల సాగు దా దాపు 3.18 లక్షల ఎకరాల్లో సాగు అవుతోందని వ్యవ సాయ శాఖ అంచనా వేసింది. దీనికి అనుగుణంగా వి త్తనాలు, ఎరువులను వ్యవసాయ శాఖ అందుబాటు లోకి తెచ్చింది. ఇప్పటికే రైతులు అవసరమైన విత్తనా లు, ఎరువులను కొనుగోలు చేసుకుని పంటల సాగుపై దృష్టి సారించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతు లు సాగు చేసే పంటల సాగు, దిగుబడులపై సూచ నలు, సలహాలను ఇచ్చారు. ఆధిక దిగుబడులపై చేప ట్టాల్సిన సస్యరక్షణ చర్యలను రైతులకు వివరించారు. ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువులు విని యోగించి దిగుబడులు పెంచుకోవాలని అవగాహన క ల్పించారు. నాణ్యత కలిగిన విత్తనాలు, పురుగు మం దులను మాత్రమే కొనుగోలు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఆశించిన విధంగా సకాలంలో వర్షాలు కురవకపోవడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఈ యేడు రుతుపవణాలు కాస్త ముందుగానే వచ్చినా ఆ తరువాత వరుణుడు ముఖం చాటేయడంతో అన్నదాతల్లో ఆందోళన మొదలైంది. తొలకరి వర్షాలకే రైతులు పత్తి విత్తనాలు విత్తడంతో సమృద్ధిగా వర్షాలు పడి వ్యవసాయ రంగం లో సాగు చేసిన పంటల దిగుబడి ఆశించిన విధంగా లాభాలు రావాలని రైతన్నలు గ్రామ దేవతలకు పూజ లు చేస్తున్నారు.
ఫ జిల్లాలో సాగు విస్తీర్ణం....
మంచిర్యాల జిల్లాలో పత్తి, వరి, కంది, మొక్క జొన్న, పెరస, మినుములు తదితర పంటల 3,18,934 ఎకరా ల్లో సాగు కానుంది. పత్తి పంట 1.58 లక్షల ఎకరాలు (1,58,161 లక్షలు), వరి 1.58 లక్షల ఎకరాలు (1,58, 753 లక్షలు), కంది 1054 ఎకరాలు, మొక్కజోన్న 531 ఎకరాలు, ఇతర పంటలు 435 ఎకరాల్లో రైతులు సాగు చేయనున్నారు. జిలుగ, జనుము విత్తనాలను సబ్సిడీ ద్వారా రైతులకు అందిస్తోంది. ఇందులో భాగంగా వ్యవ సాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి తెప్పిం చి రైతులకు అందిస్తోంది. ఇప్పటికే చాలా మంది రైతు లు విత్తనాలను కొనుగోలు చేసి తీసుకెళ్లారు. పంటల సాగు మొదలు కావడంతో వ్యవసాయ రంగంలో రైతు లు, కూలీలు వ్యవసాయ పనుల్లో నిమ గ్నమైయ్యారు. ఇంకా పత్తి 3,95,507 ప్యాకెట్లు, వరి 5837 క్వింటాళ్లు, కంది 48 క్వింటాళ్లు, మొక్క జొన్న 5.2 క్వింటాళ్లు షాపు ల్లో అందుబాటులో ఉన్నాయి.
ఫ అందుబాటులో ఎరువులు...
వానా కాలం ఖరీఫ్ పంటల సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వానికి ప్రతి పాదించిన ఎరువులు ఇప్పటి కొంత వరకు జిల్లా చేర గా ఇంకా దశల వారీగా రానున్నాయి. ఖరీఫ్ సాగుకు అవసరమైన యూరియా, డీఏపీ, కాంప్లెక్ ఎరువులు డీలర్లు, సొసైటీలు, మార్క్‌ఫెడ్‌ల వద్ద ఎరువుల నిల్వ లున్నాయి. ప్రస్తుతం యూరియా-4433.63 మెట్రిక్ ట న్నులు, డీఏపీ-1673.68 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్ ఎ రువులు-10105.45 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ- 1234.55 మెట్రిక్ టన్నులు, ఎస్‌ఎస్‌పీ-610.19 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి.