Share News

kumaram bheem asifabad- నిఘా నిర్వీర్యం

ABN , Publish Date - Oct 17 , 2025 | 10:28 PM

ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతల పరక్షణక్ష సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. నేరాలు జరిగిన కొద్ది గంటల్లోనే సీసీ కెమెరాల సహాయంతో ఎన్నో కేసులు ఛేదించి సంఘటనలు ఉన్నాయి. ఒక్క సీసీ కెమెరా పది మంది పోలీసులకు సమానమని పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో పలు ప్రధాన వీధుల్లో అమర్చిన సీసీ కెమెరాలు సాంకేతిక కారణాల ద్వారా పని చేయడం లేదని తెలుస్తోంది.

kumaram bheem asifabad- నిఘా నిర్వీర్యం
సిర్పూర్‌(టి)లో పని చేయని సీసీ కెమెరాలు

సిర్పూర్‌(టి), అక్టోబరు 17 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుత పరిస్థితుల్లో శాంతిభద్రతల పరక్షణక్ష సీసీ కెమెరాలు కీలకంగా మారాయి. నేరాలు జరిగిన కొద్ది గంటల్లోనే సీసీ కెమెరాల సహాయంతో ఎన్నో కేసులు ఛేదించి సంఘటనలు ఉన్నాయి. ఒక్క సీసీ కెమెరా పది మంది పోలీసులకు సమానమని పోలీసు అధికారులు ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. కానీ ఈ మధ్య కాలంలో సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో పలు ప్రధాన వీధుల్లో అమర్చిన సీసీ కెమెరాలు సాంకేతిక కారణాల ద్వారా పని చేయడం లేదని తెలుస్తోంది. దీని నిర్వహణ ప్రక్రియను వ్యాపారులు, పోలీసు అధికారులు ఎవరు పట్టించుకోక పోవడంతో నిఘా నిద్ర పోతుందన్న చందంగా మారిందని చెబుతున్నారు. జిల్లాలోని చాలా చోట్ల ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పర్యవేక్షణ లేక పోవడంతో పని చేయడం లేదని చెబుతున్నారు. సిర్పూర్‌(టి) గ్రామ పంచాయతీలో 14 వార్డులు, అంతర్‌ రాష్ట్ర ప్రధాన రహదారి కూడళ్ల వద్ద ఒకటి రెండు ఉండడం, మిగితా చోట్ల అసలే లేక పోవడంతో ఆ ప్రాంతాల్లో సంఘటనలు జరగినప్పుడు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పలు సందర్భాల్లో ఏమైనా భారీ సంఘటనలు జరిగినట్లయితే ఇటు పోలీసులు, మరో వైపు ప్రజలు, వ్యాపారులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉత్పన్నమవుతుందని సామాన్య ప్రజలు భావిస్తున్నారు. గతంలో సిర్పూర్‌(టి) మండల కేంద్రంలో అనేక సంఘటనలు జరిగిన దాఖలాలు ఉన్నా యి. చోరీలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు జరిగినా పోలీసులకు కేసులు ఛేదించడం ఇబ్బందిగా మారింది. పోలీసు అధికారులు ప్రజలు, వాప్యారుల సహకారంతో మండల కేంద్రంలో అవసరం ఉన్న చోట సీసీ కెరమెరాలు ఏర్పాటు చేసి పని చేసేలా మరమ్మతులు చేయించాలని మండల ప్రజలు కోరుతున్నారు.

సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు సహకరించాలి..

- సీహెచ్‌ సురేష్‌, ఎస్సై, సిర్పూర్‌(టి)

అవసరం ఉన్న చోట సీసీ కెమెరాలు ఏర్పాటుకు ప్రజలు, వ్యాపార సముదాయం వారు పోలీసులకు సహకరించాలి. ప్రస్తుతం పలు కూడల్ల వద్ద అమర్చిన సీసీ కెమెరాలు సక్రమంగా పని చేయడం లేదన్నది వాస్తవమే. వాటి మరమ్మతుకు కృషి చేస్తాం. అవసరం ఉన్న చోట ప్రజల సహకారంతో కొత్తవి ఏర్పాటు చేస్తాం.

Updated Date - Oct 17 , 2025 | 10:28 PM