ఇంటిగ్రేటెడ్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Jun 03 , 2025 | 11:37 PM
జిల్లాలో నిర్వహించే ఇంటిగ్రేటెడ్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి హారీశ్ రాజ్ అన్నారు. పాతమంచిర్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రారంభించారు.
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీశ్‌రాజ్
మంచిర్యాలక్రైం,జూన్3(ఆంధ్రజ్యోతి): జిల్లాలో నిర్వహించే ఇంటిగ్రేటెడ్ వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్యాధికారి హారీశ్ రాజ్ అన్నారు. పాతమంచిర్యాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వైద్య శిబిరాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో వందరోజుల పాటు ఇంటిగ్రేటెడ్ వైద్య శిబి రాలను నిర్వహిస్తామన్నారు. జాతీయ క్షయ నివారణ, హెచ్‌ఐవీ ఎయిడ్స్ అసంక్రమణ వ్యాధులు, హెపటైటీస్ బీసీ వాటిపైన ప్రజల్లో పరీక్షలు చే యడం, అవగాహన కలిగిస్తామన్నారు. వారంలో నాలుగు రోజుల పాటు నెలకు 16 రోజులు ఈ కార్యక్రమం నిర్వహిస్తామని ఆయా వైద్యాధికారులు, వైద్య సిబ్బంది ఆశ, ఆరోగ్య కార్యకర్తలు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆకాంక్షించారు. 102 సిబ్బంది వాహనాలను ఆర్‌బీఎస్‌కే సిబ్బంది వారి సేవలను ఐసీటీసీ సేవలను ఎక్స్‌రే చేయడానికి జిల్లా ప్రభుత్వ ఆసు పత్రి టెక్నిషియన్లు సేవలను సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు నరేశ్, డాక్టర్ సుధాకర్ నాయక్, డాక్టర్ ప్రసాద్, ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శివప్రతాప్, డాక్టర్ అమర్, డాక్టర్ రాము, డాక్టర్ రజిత, సిబ్బంది పాల్గొన్నారు.