Share News

kumaram bheem asifabad- తనిఖీలు నిర్వహించాలి

ABN , Publish Date - Dec 01 , 2025 | 10:16 PM

అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టుల వ్దద విధి నిర్వహణలో ఉన్న అధికారులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పకడ్బంధీగా తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. వాంకిడి మండల సరిహద్దులోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టును సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌ పోస్టు వద్ద వాహనాల తనిఖీలకు సంబందించిన రిజిస్టర్‌లను పరిశీలించారు

kumaram bheem asifabad- తనిఖీలు నిర్వహించాలి
వాంకిడిలోని చెక్‌ పోస్టును తనిఖీ చేస్తున్న ఎస్సీ నితికా పంత్‌

వాంకిడి, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): అంతర్రాష్ట్ర చెక్‌ పోస్టుల వ్దద విధి నిర్వహణలో ఉన్న అధికారులు సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉంటూ పకడ్బంధీగా తనిఖీలు నిర్వహించాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. వాంకిడి మండల సరిహద్దులోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టును సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్‌ పోస్టు వద్ద వాహనాల తనిఖీలకు సంబందించిన రిజిస్టర్‌లను పరిశీలించారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం, ఇతర సామగ్రి అక్రమ రవాణాను అరికట్టేందుకు చెక్‌ పోస్టు వద్ద బారికేడ్‌లు ఏర్పాటు చేయాలన్నారు. విధులలో ఉన్న సిబ్బంది సరైన డిప్యూటీ రోస్టర్‌ ప్రకారం క్రమబద్ధంగా పని చేయాలని ఆదేశించారు. ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు, అక్రమ మద్యం, ఇతర నిషేధిత వస్తువుల రవాణా అయ్యే అవకాశం ఉంటుందని చెప్పారు. చెక్‌ పోస్టు వద్ద డ్యూటీలో ఉన్న అధికారులు, సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. ప్రతి వాహనం, వ్యక్తిని కచ్చితంగా తనిఖీ చేసిన తరువాతనే వదిలి పెట్టాలని చెప్పారు. అనుమానస్పద వ్యక్తులు, వాహనాలు వంటి వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆమె వెంట సీఐ సత్యనారాయణ తదితరులు ఉన్నారు.

పోలీసుల విస్త్రత తనిఖీలు

సిర్పూర్‌(టి), డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో పోలీసులు అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాల పరిధిలో జిల్లా ఎస్పీ ప్రత్యేక చెక్‌ పోస్టును ఏర్పాటు చేసి విస్త్రతంగా తనిఖీలు చేస్తున్నారు. సిర్పూర్‌(టి)- మాకిడి రోడ్డు, వెంకట్రావుపేట పోడ్సా వంతెన వద్ద పోలీసులు, రెవెన్యూ అధికారులు సరిహద్దులో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 14, 17 తేదీల్లో రెండు విడతలలో జరుగుతున్న పంచాయతీ ఎన్నికలకు ఎటర్లకు ఆయా పార్టీల వారు ప్రలోభాలకు గురి చేసి వారికి మహారాష్ట్ర నుంచి దేవీదారు మద్యం, డబ్బులు ఇతర సామాగ్రి రావాణా కాకుండా పోలీసులు ఇతర సిబ్బంది సమన్వయంతో తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. ఇప్పటికే నామినేషన్‌ పర్వం కొనుసాగుతుందని డీఎస్సీ వహిదుద్దీన్‌, డీఎస్పీ సురేష్‌, ఎస్సై సురేష్‌లు మండలాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందో బస్తు పెంచడంతో పాటు తనిఖీలు ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. ప్రత్యేకంగా పోలీసులు మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న గడ్చిరోలి, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ నుంచి పోడ్సా వంతెన గుండా తెలంగాణలోకి వచ్చే ప్రతివాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఈ నెల 14న జరిగే పంచాయతీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు, నాయకులు పోలీసు శాఖకు సహరించాలని కోరుతున్నారు.

Updated Date - Dec 01 , 2025 | 10:17 PM