kumaram bheem asifabad- విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనుల పరిశీలన
ABN , Publish Date - Sep 24 , 2025 | 11:25 PM
మండల కేంద్రంలోని పాత ఎస్బీఐ బ్యాంకు నుంచి హనుమాన్ మందిర్ వెళ్లే దారిలో విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులను ఎస్‌ఈ శేషారావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ ఏరియాలో గతంలో విద్యుత్ స్తంభాలు ఇరుకుగా ఉండడం వల్ల విద్యుత్ తీగలు ఇబ్బందికరంగా మారి తరుచు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని చెప్పారు.
వాంకిడి, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని పాత ఎస్బీఐ బ్యాంకు నుంచి హనుమాన్ మందిర్ వెళ్లే దారిలో విద్యుత్ లైన్ పునరుద్ధరణ పనులను ఎస్‌ఈ శేషారావు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్కెట్ ఏరియాలో గతంలో విద్యుత్ స్తంభాలు ఇరుకుగా ఉండడం వల్ల విద్యుత్ తీగలు ఇబ్బందికరంగా మారి తరుచు సరఫరాలో అంతరాయం ఏర్పడిందని చెప్పారు. ఈ నేపథ్యంలో స్తంభాలు తొలగించి విద్యుత్ తీగలను సవరిస్తున్నామన్నారు. వినియోగదారులు ఇబ్బంది పడకుండా మెరుగైన విద్యత్‌ను అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
వినియోగదారులకు మెరుగైన సేవలు
ఆసిఫాబాద్, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు సాంకేతిక పరంగా సౌకర్యంగా ఉండేలా టీజీఎన్‌పీడీసీఎల్ యాప్ రూపొందించినట్లు విద్యుత్ శాఖ ఎస్‌ఈ శేషారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు తమ ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని సేవలు పొందవచ్చని సూచించారు. 20 ఫీచర్లతో యాప్ రూ పొందించామని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ నంబరు 18004250028, 1912 అందుబాటులో ఉంటాయని సూచించారు.