Share News

భూగర్భ జలాల పనుల పరిశీలన

ABN , Publish Date - Jun 27 , 2025 | 11:31 PM

మండలంలోని 30 గ్రామపంచా యతీల్లో జలశక్తి అభియాన్‌ కింద చేపట్టిన 46 వివిధ రకాల అభివృద్థి ప నులను శుక్రవారం కేంద్ర భూగర్భ నీటి బోరు శాస్త్రవేత్త రాంబాబు పరిశీ లించారు.

భూగర్భ జలాల పనుల పరిశీలన
చింతలపల్లి వద్ద నీటి కుంటను పరిశీలిస్తున్న శాస్త్రవేత్త రాంబాబు

చెన్నూరు, జూన్‌ 27 (ఆంధ్రజ్యోతి) : మండలంలోని 30 గ్రామపంచా యతీల్లో జలశక్తి అభియాన్‌ కింద చేపట్టిన 46 వివిధ రకాల అభివృద్థి ప నులను శుక్రవారం కేంద్ర భూగర్భ నీటి బోరు శాస్త్రవేత్త రాంబాబు పరిశీ లించారు. సంబంధిత పథకం కింద వివిధ గ్రామాల్లో నీటి కుంటలను ని ర్మించగా వాటి ప్రగతిని క్షేత్రస్ధాయిలో సమీక్షించి వివరాలను నమోదు చే సుకున్నారు. ఫారెస్టు ట్రెంచ్‌, చిన్న నీటి కుంటలు, ఇంకుడుగుంతల నిర్మా ణాలు, భూగర్భ రీచార్జ్‌ స్ట్రక్చర్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్త రాంబాబు మాట్లాడుతూ భూగర్భ రీచార్జ్‌ల నిర్మాణాల వల్ల భవిష్యత్‌లో భూగర్భ జలాలు అడుగంటకుండా ఉంటాయన్నారు. అనంతరం ఆయనను ఎంపీడీవో కార్యాలయంలో శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్య క్రమంలో ఎంపీడీవో మోహన్‌, నోడల్‌ అధికారి సదానందం, ఇంజనీరింగ్‌ క న్సల్‌టెంట్‌ సత్యనారాయణ, చంద్రశేఖర్‌, డీఆర్‌పీ రాజ్‌కుమార్‌, ప్లాంటేషన్‌ అధికారులు శ్రీనివాస్‌, కుమారస్వామి, మధు, టీఏలు మహేశ్వర్‌రెడ్డి, రవీం దర్‌, వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jun 27 , 2025 | 11:31 PM