ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన
ABN , Publish Date - Dec 13 , 2025 | 11:19 PM
తాండూర్‌లోని ఎన్నికల సా మగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరి శీలించారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామగ్రితో త రలి వెళ్లారు.
తాండూర్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి) : తాండూర్‌లోని ఎన్నికల సా మగ్రి పంపిణీ కేంద్రాన్ని శనివారం జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య పరి శీలించారు. పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది ఎన్నికల సామగ్రితో త రలి వెళ్లారు. అంతకుముందు అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు పోలింగ్ ఉంటుందని, అనంతరం ఓట్ల లెక్కింపు ఉం టుందన్నారు. ఆయన వెంట అధికారులు ఉన్నారు. పోలింగ్‌కు సంబం ధిం చిన ఎన్నికల సామగ్రిని వాహనాల్లో పోలీసు బందోబస్తు మధ్య ఎన్ని కల సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. ఎంపీడీవో శ్రీనివాస్, తహసీ ల్దార్ జ్యోత్న్న సామాగ్రి పంపిణీని పరిశీలించారు.