kumaram bheem asifabad- పాఠశాలను తనిఖీ చేసి.. పాఠాలు బోధించి..
ABN , Publish Date - Jul 18 , 2025 | 11:29 PM
మండంలోని పవర్‌గూడలోని ప్రాథమిక పాఠశాలను శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రశ్నలు అడగి సమాధానాలు రాబాట్టారు.మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రిని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు.
జైనూర్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మండంలోని పవర్‌గూడలోని ప్రాథమిక పాఠశాలను శుక్రవారం అదనపు కలెక్టర్ దీపక్ తివారీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పాఠాలు బోధించారు. ప్రశ్నలు అడగి సమాధానాలు రాబాట్టారు.మండల కేంద్రంలోని 30 పడకల ఆసుపత్రిని ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓపీ, శస్త్రచికిత్సల గది, మందుల నిల్వలను పరిశీలించారు. చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. వారి ఆరోగ్య స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే ఆవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. పరిసరాల శుభ్రత గ్రామాల్లో పాటించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దోమల నివారణకు ఫాగింగ్ స్ర్పే చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించారు. చిన్నారులు, గర్భిణులకు మెనూ ప్రకారం భోజన అందించాలని రక్తహీనత ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మండలంలోని భుషిమెట్ట గ్రామాన్ని సందర్శించి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో సమస్యలు లేకుండా చూడాలని ఎంపీడీవో సుధాకర్‌రెడ్డిని ఆదేశించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ కుడిమెత విశ్వనాథ్, ఆసుపత్రి డీసీహెచ్‌ఎస్ చెన్న కేశవ్‌రావ్, సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, వైద్యాధికారులు అరవింద్,మురళి, ఉదయ్, ఎంపీడీవో సుధాకర్‌రెడ్డి, ఎంపీవో మోహన్, ఎంఈవో మధుకర్, నాయకుడు మేస్రాం అంబాజీ, గ్రామ కార్యదర్శి ఆన ంద్ తదితరులు ఉన్నారు.