Share News

Senior orthopedic surgeons at Apollo Hospital: శస్త్రచికిత్స అవసరం లేకుండానే కీళ్ల సమస్యలకు పరిష్కారం

ABN , Publish Date - Sep 15 , 2025 | 06:00 AM

మోకాలు, హిప్‌ రీప్లే్‌సమెంట్‌ వంటి శస్త్రచికిత్సల అవసరం లేకుండానే జాయింట్స్‌ సమస్యలకు పరిష్కారం చూపే వినూత్న విధానాలపై దృష్టి సారించామని..

Senior orthopedic surgeons at Apollo Hospital: శస్త్రచికిత్స అవసరం లేకుండానే  కీళ్ల సమస్యలకు పరిష్కారం

  • శస్త్రచికిత్సల్లో కచ్చితత్వం, ఆధునికతపై దృష్టి పెట్టాం

  • మీడియాతో సీనియర్‌ ఆర్థో సర్జన్‌ సోమశేఖర్‌రెడ్డి

  • అపోలో ఆస్పత్రిలో ఆర్థోప్లాస్టీ ఆర్థోస్కోపీ సమ్మిట్‌

హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మోకాలు, హిప్‌ రీప్లే్‌సమెంట్‌ వంటి శస్త్రచికిత్సల అవసరం లేకుండానే జాయింట్స్‌ సమస్యలకు పరిష్కారం చూపే వినూత్న విధానాలపై దృష్టి సారించామని అపోలో ఆస్పత్రి సీనియర్‌ ఆర్థో, జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ సర్జన్‌ డాక్టర్‌ ఎన్‌. సోమశేఖర్‌ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఆర్థోస్కోపీ సొసైటీ (హైదరాబాద్‌), ట్విన్‌ సిటీస్‌ ఆర్థోపెడిక్‌ సొసైటీ (టీసీవోఎస్‌), తెలంగాణ ఆర్థోపెడిక్‌ సర్జన్స్‌ అసోసియేషన్‌, అపోలో ఆస్పత్రి సంయుక్త ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఇన్‌స్టిట్యూట్‌ మెడికల్‌ సైన్సెస్‌ అండ్‌ రీసెర్చ్‌లో 9వ ఆర్థోప్లాస్టీ, ఆర్థోస్కోపీ సమ్మిట్‌ ఆదివారం నిర్వహించారు. ఈ సదస్సుకు ఆర్గనైజింగ్‌ చైర్మన్‌గా డాక్టర్‌ సోమశేఖర్‌రెడ్డి, కోర్సు డైరెక్టర్‌గా డాక్టర్‌ మిథిన్‌ ఆచి వ్యవహరించారు. సదస్సులో చర్చించింన అంశాలను సోమశేఖర్‌ రెడ్డి మీడియాకు వివరించారు. జాయింట్స్‌ మధ్య కార్టిలేజ్‌ను పునరుత్పత్తి చేసే నూతన సాంకేతికతపై సదస్సులో విస్తృతంగా చర్చించామని తెలిపారు. ఆర్థోపెడిక్‌ చికిత్సల్లో కొత్త విధానాలను విస్తరింపజేయడంతోపాటు ప్రతి రోగి వేగంగా కోలుకోవాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్న ట్లు చెప్పారు. శస్త్రచికిత్సల్లో మరింత కచ్చితత్వం, ఆధునికత దిశగా అడుగులు వేస్తున్నామని పేర్కొన్నారు. యువ ఆర్థోపెడిక్‌ సర్జన్ల నైపుణ్యాలు మెరుగుపరిచేందుకు ఈ శిక్షణ కార్యక్రమాన్ని రూపొందించామని చెప్పారు. సీనియర్‌ ఆర్థో, జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ సర్జన్‌, ఆర్థోప్లాస్టీ ఆర్థోస్కోపీ సమ్మిట్‌ కోర్సు డైరెక్టర్‌గా డాక్టర్‌ మిథిన్‌ ఆచి మాట్లాడుతూ ఆర్థోపెడిక్‌ చికిత్సల్లో అత్యాధునిక పురోగతులను ప్రత్యేకంగా చర్చించామన్నారు. జాయింట్‌ రీప్లే్‌సమెంట్‌ శస్త్రచికిత్సల్లో రోబోటిక్స్‌ పాత్రపై అవగాహన కల్పించడంతోపాటు మోకాలి కార్టిలేజ్‌ గాయాలకు చికిత్స చేసే విధానంపైనా చర్చించినట్లు తెలిపారు. రోబోటిక్‌ శస్త్రచికిత్స దీర్ఘకాలిక ప్రభావంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నప్పటికీ.. హిప్‌ రీప్లే్‌సమెంట్‌లో కప్‌ను కచ్చితంగా అమర్చడం ద్వారా దాని ప్రయోజనాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని వివరించారు. దేశీయంగా అభివృద్ధి చేసిన రోబోటిక్‌ పరిష్కారాలు ఖర్చులను గణనీయంగా తగ్గించగల సామర్థ్యం కలిగి ఉండటమే కాక, కచ్చితమైన చికిత్సను అందించగలవని అభిప్రాయపడ్డారు.

Updated Date - Sep 15 , 2025 | 06:01 AM