kumaram bheem asifabad- రిజర్వేషన్లలో ఆదివాసీలకు అన్యాయం
ABN , Publish Date - Sep 28 , 2025 | 10:56 PM
ప్రభుత్వం ప్రకటించిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని ఆదివాసీ గిరిజన నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రిజర్వేష్లను కూడా దోపిడీ చేసేలా కుట్రలు పన్నుతున్నారన్నారు.
కెరమెరి, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ప్రకటించిన జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీ స్థానాల రిజర్వేషన్లలో ఆదివాసీలకు అన్యాయం జరిగిందని ఆదివాసీ గిరిజన నాయకులు అన్నారు. మండల కేంద్రంలోని ఆదివాసీ భవన్‌లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు మాట్లాడారు. ఏజెన్సీ ప్రాంతాల్లో రిజర్వేష్లను కూడా దోపిడీ చేసేలా కుట్రలు పన్నుతున్నారన్నారు. కెరమెరి జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాలు ఎస్టీలకు రిజర్వేషన్ కల్పించకుంటే స్థానిక ఎన్నికలను బహిష్కరిస్తామని తెలిపారు. సమావేశంలో లక్ష్మణ్, దేవ్‌రావు, జగన్నాథ్‌రావు, విజయ్‌కుమార్, ప్రభాకర్, రఘునాథ్, భరత్‌భూషన్, చందన్షా, మోతిరాం, దృపతాబాయి, తుకారాం, భీంరావు, నాగోరావు, జాలీంషావ్, ధర్ము, జగన్నాథ్‌రావు, కుసుంరావు, ఆనంద్‌రావు, రాంచందర్, బాదిరావు, రాంచందర్, బాపురావు, బీర్షవ్, సురేష్, దేవ్‌రావు, సాగర్, తదితరులు పాల్గొన్నారు.
రిజర్వేషన్ల ప్రక్రియపై భగ్గుమన్న ఆదివాసీలు
జైనూర్, సెప్టెంబరు 28 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం ఖరారు చేసిన ఎంపీపీ, జడ్పీటీసి స్థానాల రిజర్వేషన్లలో తమకు అన్యాయం జరిగిందని ఆదివాసీ సంఘాలు భగ్గు మంటున్నాయి. మండలంలోని ఢబోలిలో ఆదివారం ఆదివాసీలు సమావేశమై పలు తీర్మానాలు చేశారు, జడ్పీటీసీతో పాటు జడ్పీ చైర్మన్ రిజర్వేషన్లు గిరిజన ప్రాంతంలో పెసా చట్టానికి అనుకూలంగా లేవని మండి పడ్డారు. ఉన్నతాధికారులు స్పందించి గిరిజన ప్రాంతంలో పెసా చట్టానికి అనుగుణంగా ఎంపీపీ, జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్ల పదవులను గిరిజనుల ద్వారానే భర్తీ చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. సమావేశంలో మహగాం, మార్లవాయి, ఢబోలి రాయి సెటర్ల సార్మేడిలు జుగునాక దేవరావ్, కుంర దుందేరావ్, నాయకులు మడావి భీంరావ్, కుంర శాంరావ్, మేస్రాం రాహుల్, ఆత్రం రవిందర్, మేస్రాం నాగోరావ్, మేస్రాం సీతారాం, తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు మధురాజ్, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.