kumaram bheem asifabad- వారసంత..సమస్యల చింత
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:16 PM
జిల్లాలోని గ్రామీణ ప్రజలు వివిధ అవసరాల కోసం నిత్యావసరాలు, కూరగాయలు ఇతర వస్తువుల కొను గోళ్లు వంటివి వార సంతలపై ఆధారపడుతుంటారు. ప్రధానంగా పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో మండలంలోని ప్రతీ వారం నిర్వహించే వార సంతలో కనీస సౌకర్యాలు లేక సంతకు వచ్చే వినియోగ దారులకు, వ్యాపారులకు మండల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు.
- ఇబ్బందుల్లో వ్యాపారులు, ప్రజలు
- పట్టించుకోని అధికారులు
చింతలమానేపల్లి, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామీణ ప్రజలు వివిధ అవసరాల కోసం నిత్యావసరాలు, కూరగాయలు ఇతర వస్తువుల కొను గోళ్లు వంటివి వార సంతలపై ఆధారపడుతుంటారు. ప్రధానంగా పల్లెలు, పట్టణ ప్రాంతాల్లో మండలంలోని ప్రతీ వారం నిర్వహించే వార సంతలో కనీస సౌకర్యాలు లేక సంతకు వచ్చే వినియోగ దారులకు, వ్యాపారులకు మండల ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ వారసంతల్లో భారీగా వ్యాపారాలు జరుగుతు న్నాయి. ఏటా లక్షల్లోనే ఆదాయం వస్తుంది. ఈ ఏడాది కూడా అంతకు మించి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ప్రతీ సంవత్సరం లక్షల ఆదాయం వస్తున్నా, సంబంధిత అధికారులు ఈ సంతలో ఎలాంటి వస తులు కల్పించపోవడం పట్ల జిల్లా ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వారసంతల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని మండల ప్రజలు కోరుతున్నారు.
- మండల కేంద్రాల్లో..
జిల్లా వ్యాప్తంగా 15 మండల కేంద్రాల్లో వారసం తలు కొనసాగుతున్నాయి. పలు మేజర్ పంచాయతీ ల్లోనూ వారసంతలు కొనసాగిస్తున్నారు. సంత నిర్వహ ణకు పంచాయతీలకు రూ. లక్షల్లో ఆదాయం సమకూ రుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రవుఖ పాత్ర పోషించే సంత నిర్వహణకు స్థలాలు లేక రోడ్లపైనే క్రయ విక్రయాలు జరుపుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడి పలు సంత స్థలాలు ఆక్రమణలకు గురయ్యా యి. మరి కొన్ని చోట్ల రోడ్లపై సంతలు నిర్వహిస్తున్నా రు. దీంతో వారసంత రోజు ట్రాఫిక్ సమస్య తలెత్తుతోంది.
- ఆదాయం ఇలా..
పంచాయతీ అధికారులు సంతకు వేలం పాట ఉన్న ట్లు ముందుగానే ప్రజలకు తెలియజేసి ఎడాదికొక సారి వేలం పాట నిర్వహిస్తారు. ఏటా పన్నులు, పన్నేతర ఆదాయం ద్వారా జిల్లాలో రూ. ఐదు కోట్లకు పైగా ఆదాయం వస్తున్నది. కౌటాల వారసంతకు రూ. 4.20 లక్షలు, చింతలమానేపల్లి మండలంలోని రవీంద్ర నగర్ వారసంతకు రూ. 3.48 లక్షలు, చింతలమానేపల్లి మండల కేంద్రంలో నిర్వహించే వార సంతకు రూ. లక్ష, బెజ్జూర్ వారసంతకు రూ. 2.20 లక్షల ఆదాయం సమకూరుతోంది. కెరమెరి వారసంతకు రూ. 1.9 లక్షలు, వాంకిడి వారసంతకు రూ. 2.4లక్షలు, దహె గాం వారసంతకు రూ. 3 లక్షలు, జైనూరు వారసం తకు రూ. 3 లక్షలు, కాగజ్‌నగర్ నిర్వహించే వారసం తకు రూ. 3.5 లక్షలు ఆదాయం వస్తున్నది. కొన్ని సంతల నిర్వహణ గడువు ముగిసినా వివిధ కారణాల తో ఇప్పటి వరకు వేలం నిర్వహించలేదు.
- ట్రాఫిక్ సమస్య...
వారసంత రోజున ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు కూరగాయలు, నిత్యావసరాల కొనుగోలుకు ఆటోలు, జీపులు, ఇతర వాహనాల్లో వస్తుంటారు. ఈ వాహనాలకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలం కేటాయిం చక పోవడంతో వాహనాలను రోడ్డుపైనే నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుంది. దీనికి తోడు ఆయా మండల వ్యా పారులతో పాటు, కాగజ్‌నగర్, కౌ టాల, సిర్పూర్ (టి), బెల్లంపలి,్ల తదితర మండలాలు, పట్టణ ప్రాంతాల వ్యాపారులు సరకులను వాహనాల్లో తీసుకొస్తారు. వ్యాపారుల వాహ నాలకు రక్షణ లేక పోవడంతో ఆ వాహనాన్నింటినీ సంతలోనే పార్కింగ్ చేస్తున్నారు. వ్యాపారాలు చేసుకోవడానికి ప్రత్యేకంగా షెడ్లను ఏర్పాటు చేయకపోవడంతో ఎండలోనే వ్యాపా రాలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇకనైనా సంబంధిత అఽధికారులు మౌలిక వసతులు కల్పించేం దుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
కనీస సౌకర్యాలు కల్పించాలి..
- కేదారి, వినియోగదారుడు
వారసంతల్లో కనీస సౌకర్యాలు కరువయ్యాయి. మండలాల్లో నిర్వహించే వారసంతలో కనీస సౌక ర్యాలు లేక ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతు న్నారు. కనీస సౌకర్యాలైన తాగునీరు, మరుగుదొడ్లను ఏర్పాటు చేస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది.
పార్కింగ్ స్థలం కేటాయించాలి..
- తిరుపతి, ఆటో డ్రైవర్
వారసంతకు వచ్చే వాహనాలు పెట్టుకునేందుకు స్థలం కేటాయించాలి. పార్కింగ్ స్థలం లేక పోవడంలో వాహనాలు అన్ని రోడ్డుపైనే నిలపడం వల్ల ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి.