మౌలిక వసతులు కరువు
ABN , Publish Date - Sep 10 , 2025 | 11:06 PM
కొల్లా పూర్‌లోని మాతా, శిశు సం రక్షణ కేంద్రంలో మౌలిక వ సతులు కరువయ్యాయని బీజేపీ నాయకులు ఆరో పించారు.
కొల్లాపూర్, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : కొల్లా పూర్‌లోని మాతా, శిశు సం రక్షణ కేంద్రంలో మౌలిక వ సతులు కరువయ్యాయని బీజేపీ నాయకులు ఆరో పించారు. బుధవారం కొ ల్లాపూర్ పట్టణంలోని రా మాపురం రహదారిలో ఉ న్న మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో గర్భిణుల సమస్య లను బీజేపీ రాష్ట్ర కమిటీ స భ్యుడు సందు రమేష్, నా యకులు తమటం సాయికృష్ణగౌడ్, మేకల శ్రీనివాస్‌యాదవ్, కేతూరి నారాయణ ఆధ్వర్యంలో నాయకులు తెలుసుకున్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రాతినిథ్యం వహి స్తున్న నియోజకవర్గంలో ఉన్న మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో రెగ్యులర్ గైనకాల జిస్ట్, చిన్న పిల్లల డాక్టర్ లేరని తెలి పారు. వారంలో ఒక రోజు బయట నుంచి వచ్చే డాక్టర్ గర్భి ణులకు ఓపీ వైద్య సేవలు అందిస్తున్నారని, అది కూడా ఈ రోజు రాలేదని నాయకులు అసహనం వ్యక్తం చేశారు. తాగునీటి వసతి కూడా లేదని, ప్రత్యేక ట్రాన్స్ ఫార్మర్ లేకపోవడంతో విద్యుత్ సమస్యతో డయాలసిస్ రోగులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నా రు. రెగ్యులర్ డాక్టర్లను నియమించకపోతే పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమా లు చేస్తామని వారు స్పష్టం చేశారు. కార్యక్ర మంలో జిల్లా ఉపాధ్యక్షుడు తమటం శేఖర్ గౌడ్, జిల్లానాయకులు చంద్రశేఖర్‌రావు, భాస్క ర్‌గౌడ్, ఓరే శేఖర్, రాజ శేఖర్, రమేష్ యాదవ్, రమేష్‌గౌడ్, రెడ్డి నరసింహ, భరత్‌యాదవ్, రాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.