Share News

Infosys: ఇన్ఫోసిస్‌.. మహిళలకు ఇంకో చాన్స్‌!

ABN , Publish Date - Oct 17 , 2025 | 02:45 AM

ఓవైపు ఐటీ రంగంలో లేఆఫ్‌లు కొనసాగుతుండగా.. మరోవైపు దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాత్రం నా రూటే సపరేటు అంటోంది...

Infosys: ఇన్ఫోసిస్‌.. మహిళలకు ఇంకో చాన్స్‌!

  • కెరీర్‌ గ్యాప్‌ ఉన్న వారికి ఉద్యోగాలిస్తున్న ఐటీ సంస్థ

  • ఉద్యోగులకు రిఫరెన్స్‌కు 50 వేల వరకు ప్రోత్సాహాకాలు

  • ‘రీస్టార్ట్‌ విత్‌ ఇన్ఫోసిస్‌ ఇనిషియేటివ్‌’ పేరుతో ప్రోగ్రామ్‌

హైదరాబాద్‌, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): ఓవైపు ఐటీ రంగంలో లేఆఫ్‌లు కొనసాగుతుండగా.. మరోవైపు దేశీయ సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ మాత్రం నా రూటే సపరేటు అంటోంది. ఐటీ రంగం నుంచి వివిధ కారణాలతో కొంతకాలంగా విరామం తీసుకున్న మహిళా నిపుణులకు తిరిగి ఉద్యోగాలిచ్చేందుకు ఆ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ‘రీస్టార్ట్‌ విత్‌ ఇన్ఫోసిస్‌ ఇనిషియేటివ్‌’ పేరుతో కొత్త రిఫరల్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. దీని ద్వారా ప్రస్తుతం తమ కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులు.. తమ పరిచయస్తుల్లో ఉన్న అర్హులైన మహిళా నిపుణులను రిఫర్‌ చేయొచ్చని.. వారు ఉద్యోగాలకు ఎంపికైతే రూ.50,000 వరకు రివార్డులు అందిస్తామని ప్రకటించింది. ఈ మేరకు తమ ఉద్యోగులకు అంతర్గత ఈమెయిల్‌లో సందేశాన్ని పంపింది. ఇక ఈ ప్రోగ్రామ్‌కు అర్హత సాధించాలంటే అభ్యర్థులు ఆయా విభాగాల్లో కనీసం రెండేళ్ల పని అనుభవం కలిగి ఉండాలి. అలాగే కనీసం 6 నెలల కెరీర్‌ బ్రేక్‌ తీసుకున్న వారికి ఈ అవకాశాలు వర్తిస్తాయి. నూతన నియామకాల్లో భాగంగా కంపెనీ డెవలపర్లు, టెక్‌ లీడ్‌లు, ప్రాజెక్ట్‌ మేనేజర్‌లు వంటి వివిధ సాంకేతిక పదవులను భర్తీ చేయాలని యోచిస్తోంది. ఇక ఉద్యోగులు రిఫర్‌ చేసిన అభ్యర్థులు ఇంటర్వ్యూలో ఎంపికైతే.. లెవల్‌-3 నియామకాలకు రూ.10 వేలు, లెవల్‌-4లో రూ.25వేలు, లెవల్‌-5లో రూ.35వేలు, లెవల్‌-6లో రూ.50,000 వరకు రివార్డులు అందజేయనున్నట్లు ఇన్ఫోసిస్‌ వివరించింది.

Updated Date - Oct 17 , 2025 | 02:45 AM