Share News

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Oct 30 , 2025 | 10:12 PM

ఇందిరమ్మ ఇళ్లు పొందిన లబ్ధిదారులు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన 63 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు.

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి
మంజూరు పత్రాలు అందజేస్తున్న ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు

బెజ్జూరు, అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్లు పొందిన లబ్ధిదారులు పనులను వేగవంతం చేయాలని ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు అన్నారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో గురువారం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు అయిన 63 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం కేంద్ర ప్రభుత్వం రెండు లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం మూడు లక్షలు అందజేస్తుందని తెలిపారు. లబ్ధిదారులు సకాలంలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకుని బిల్లులు పొందాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున ఇంటి నిర్మాణాల పనుల్లో ఆలస్యం జరుగుతుందని అన్నారు. రాబోయే ఎనిమిది నెలల్లోగా ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకోవాలని సూచించారు. అలాగే ఎస్టీల కోసం సీఎంతో మాట్లాడి 500 అదనంగా ఇళ్లు వచ్చేలా చూస్తానని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ఆధ్వానంగా మారాయని అన్నారు. రాబోయే రోజుల్లో దశల వారీగా రోడ్ల నిర్మాణం కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అంతకు ముందు ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి బాపుగూడ వరకు రూ.65 లక్షలతో బీటీ రోడ్డు, వంతెన నిర్మాణానికి భూమి పూజ చేశారు. పనలు సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ రామ్మో హన్‌, ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్‌, నాయకులు శంకర్‌, తిరుపతి, భిక్షపతి, రాజారాం, బాలకృష్ణ, దిగంబర్‌, వశీఖాన్‌, దిలీప్‌, కార్యదర్శులు వైకుంఠం, కృష్ణమాచారి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 30 , 2025 | 10:12 PM