Share News

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Oct 24 , 2025 | 10:13 PM

నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులను లబ్ధిదారులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లాలోని అడ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ఇందిర మ్మ ఇళ్ల పనులను శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసిన ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులను వేగవంతం చేయాలి
ఇళ్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులను లబ్ధిదారులు వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లాలోని అడ గ్రామ పంచాయతీలో కొనసాగుతున్న ఇందిర మ్మ ఇళ్ల పనులను శుక్రవారం కలెక్టర్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నిరుపేదలకు మంజూరు చేసిన ఇళ్ల లబ్ధిదారులు నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. వర్షాకాలం ముగిసినందున నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, నిర్దేశిత విస్తీర్ణంలో ఇల్లు నిర్మించుకోవాలని చెప్పారు. నిర్మాణ దశల వారీగా బిల్లులు సంబంధిత లబ్ధిదారుల ఖాతాలలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం ఉచిత ఇసుకను అందిస్తుందని, అన్నారు. లబ్ధిదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల పనులను పర్యవేక్షించాలని చెప్పారు. ప్రతి రోజు లబ్ధిదారులతో మాట్లాడి పనుల పురోగతిని సమీక్షించాలని సూచించారు. జిల్లాలో లబ్ధిదారులకు మంజూరైన ప్రతి ఇందిరమ్మ ఇంటి పనులు మొదలు పెట్టే విధంగా అధికారులు సమన్వయంతో కృషి చేయాలని తెలిపారు.. ఆయన వెంట గృహ నిర్మాణ శాఖ పీడీ వేణుగోపాల్‌, ఇంజనీరింగ్‌ అధికారులు ఉన్నారు.

ర్యాలీలో పాల్గొని.. ప్రతిజ్ఞ చేయించి

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని శుక్రవారం నిర్వహించిన ర్యాలీలో కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే పాల్గొని అధికారులు, సిబ్బంది చేత ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సముదాయం ఆవరణలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, తెలంగాణ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బైక్‌ ర్యాలీ, అవగాహన కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ డేవిడ్‌, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి సీతారాం, మంచిర్యాల, కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాల క్లస్టర్‌ ప్రోగ్రాం మేనేజర్‌లు నీలిమలతో కలిసి కలెక్టరేట్‌ నుంచి పట్టణంలోని బస్టాండు మీదుగా శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండి నియంత్రణలో బాధ్యతగా వ్యవహరించాలని అన్నారు. జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ రహిత జిల్లాగా నిర్మిద్దామని చెప్పారు. ప్రతి ఒక్కరూ వ్యాధులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు. హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ వంటి లక్షణాలు ఉంటే వీలైనంత త్వరగా పరీక్షించుకోవాలన్నారు. సత్వర వైద్య సేవలు పొందాలని, జీవిత భాగస్వామికి కూడా పరీక్షలు చేయించాలని సూచించారు. వ్యాధిపై బాధ్యత గల పౌరుడిగా సమగ్ర అవగాహన కలిగి ఉండి పొరుగు వారికి అవగాహన కల్పించాలని, వాయధిగ్రస్తుల పట్ల స్నేహభావంతో మెలిగి వారిలో ఆత్మస్థైర్యం నింపాలని తెలిపారు. వ్యాధి వ్యాప్తి నివారణకు నిరంతరం సహకరించాలని, వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకుండా వారిని ఆదరించి ఆత్మ విశ్వాసం కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది, ఉద్యోగులు, యువజన సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2025 | 10:13 PM