ఇందిరమ్మ ఇళ్ల పనులు త్వరగా చేపట్టాలి
ABN , Publish Date - Oct 14 , 2025 | 11:09 PM
ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనులను త్వరగా చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు.
- ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేటటౌన్, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి) : ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణ పనులను త్వరగా చేపట్టాలని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. మంగళవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లింగాల, బల్మూరు మండలాల చెంచు మహి ళలకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామ న్నారు. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణ పనులు త్వరగా చేపట్టాల న్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో చిన్న చిన్న గుడిసెల్లో నివసిస్తున్న చెంచులందరికీ ఇందిర మ్మ ఇళ్లు ఇస్తామన్నారు. కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు పాల్గొన్నారు.
రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ
అచ్చంపేట రూరల్, (ఆంధ్రజ్యోతి) : అచ్చం పేట మండలంలోని పల్కపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేశారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతీ రైతుకు ఎకరానికి 100శాతం సబ్సిడీతో 100కేజీలు విత్తనాలు పం పిణీ చేస్తున్నామని తెలిపారు. అచ్చంపేటలో 1230 ఎకరాలకు పంపిణీ చేశామన్నారు. అచ్చం పేట నియోజకవర్గంలో ఏడు మండలాల్లో చారకొండ, అమ్రాబాద్, పదర మండలాలకు సబ్సిడీ విత్తనాలు రాలేదని త్వరలో వచ్చేలా ప్రయత్నిస్తామన్నారు. కార్యక్రమానికి వ్యవసా య శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఎం.చంద్రశేఖర్, ఏవో కే.కృష్ణయ్య, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు సి.గోపాల్‌రెడ్డి ఉన్నారు.