kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులను త్వరగా పూర్తి చేయాలి
ABN , Publish Date - Nov 11 , 2025 | 10:22 PM
జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సబుదాయంలోని వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, విద్యాశాఖాధికారులు, గృహ నిర్మాణ శాఖాధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, నర్సరీలలో మొక్కల పెంపకం, ఈ నెల 14న పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహణ అం శాలపై మంగళవారం సమీక్ష సమావేశంలో నిర్వహించారు.
ఆసిఫాబాద్, నవంబరు 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతంగా చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సబుదాయంలోని వీసీ హాల్ నుంచి అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి జిల్లాలోని ఎంపీడీవోలు, అసిస్టెంట్ ప్రాజెక్టు మేనేజర్లు, విద్యాశాఖాధికారులు, గృహ నిర్మాణ శాఖాధికారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు, నర్సరీలలో మొక్కల పెంపకం, ఈ నెల 14న పాఠశాలలో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహణ అం శాలపై మంగళవారం సమీక్ష సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిరుపేదల కోసం ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకంలో లబిఽ్ధ పొందిన వారు పనులు త్వరగా పూర్తి చేసే విధంగా సంబంధిత అధికారులు పర్యవేక్షణ చర్యలు చేపట్టాలన్నారు. వర్షాకాలం పూర్తి అయినందున ప్రతి లబ్ధిదారుడి ఇంటి నిర్మాణం ప్రారంభించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇళ్ల నిర్మాణ పనులను త్వరగా ప్రారంభించేలా గృహ నిర్మాణ శాఖ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. రెండు రోజులలో లబ్ధి పొందిన ప్రతి లబ్ధిదారుడు పనులు ప్రారంభించాలని ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లు మంజూరైన లబ్ధిదారులు పనులు ప్రారంభించేలా అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్య వహించిన అధికారులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2026 సంవత్సరం వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 52 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా నిర్దేశిం చామని అన్నారు. ఇందులో భాగంగా ప్రతి గ్రామ పంచాయతీలో లక్ష్యానికి అనుగుణం గా నర్సరీలు ఏర్పాటు చేసి మొక్కలు పెంచేందుకు కార్యాచరణ రూపొందించాలని చెప్పారు. అవసరమైన మట్టి, విత్తనాలను సేకరించాలని తెలిపారు. ఈ నెల 14న ప్రతి ప్రభుత్వ యజమాన్య ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులతో పేరెంట్స్ కమిటీ సమావేశం నిర్వహించాలని అన్నారు. పాఠశాలల అభివృద్ధికి చేపడుతున్న చర్యలపై వివరించాలని సూచించారు. విద్యార్థుల తల్లిదండ్రులు వందశాతం సమావేశానికి హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ కలెక్టర్ జాస్తిన్ జోల్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రకాష్‌రావు, జిల్లా పంచాయతీ అధికారి భిక్షపతి, ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఏపీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులు పాల్గొన్నారు.