Share News

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులు సకాలంలో పూర్తవ్వాలి

ABN , Publish Date - Dec 20 , 2025 | 10:07 PM

నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులను లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో శనివారం ఎన్‌ఐసీ వీసీ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌లు దీపక్‌ తివారి, డేవిడ్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రకాషరావులతో కలిసి వీసీ ద్వారా జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, గృహ నిర్మాణ శాఖ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు.

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్ల పనులు సకాలంలో పూర్తవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): నిరుపేదల సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పనులను లబ్ధిదారులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ భవన సముదాయంలో శనివారం ఎన్‌ఐసీ వీసీ కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి జిల్లా అదనపు కలెక్టర్‌లు దీపక్‌ తివారి, డేవిడ్‌, గృహ నిర్మాణ శాఖ పీడీ ప్రకాషరావులతో కలిసి వీసీ ద్వారా జిల్లాలోని ఎంపీడీవోలు, ఎంపీవోలు, గృహ నిర్మాణ శాఖ ఏఈలు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతం చేసి పురోగతి సాధించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసినందున ఎంపీడీవోలు, ఎంపీవో లు, కార్యదర్శులు తమ పరిధిలో ఇళ్ల్ల నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. ఇంకా ప్రారంభం కాని ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి తప్పని సరిగా నిర్మాణాలు ప్రారంభించేలా చూడాలన్నారు. ప్రతి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి నిర్మాణాలపై పర్యవేక్షించి పనులు వేగవంతం చేసేలా కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి దత్తారావు, డీఎల్‌పీవో ఉమర్‌ హుస్సేన్‌, డీఈఈలు వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫౌండేషన్‌ సేవలు అభినందనీయం

ఆసిఫాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): దృష్టి లోపం ఉన్న వారికి భారత డైనమిక్‌ లిమిటెడ్‌ (భారత రక్షణ మంత్రిత్వ శాఖ), బ్ల్లైండ్‌ విజన్‌ ఫౌండేషన ఆధ్వర్యంలో స్మార్ట్‌ విజన్‌ కళ్ల జోడు అందించడం అభిందనీయమని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో ఏఆ్పటు చేసిన కార్యక్రమానికి ఎస్పీ నితికా పంత్‌, అదనప కలెక్టర్‌ దీపక్‌ తివారి, జిల్లా సంక్షేమాధికారి భాస్కర్‌లతో కలిసి 26 మంది దృష్టి లోపం ఉన్న వారికి స్మార్ట్‌ విజన్‌ కళ్ల జోళ్లను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ దేశ రక్షణ రంగంలో ఎంతో అనుభవం ఉన్న భారత్‌ డైనమిన్‌ లిమిటెడ్‌ సంస్థ ఆధ్వర్యంలో బ్లైండ్‌ విజన్‌ ఫౌండేషన్‌ వారు సామాజిక బాధ్యతలో భాగంగా దృష్టి లోపం ఉన్న వారికి కళ్ల జోడులు అందించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో బ్లైండ్‌ డిజైన ఫౌండేషన ప్రతినిధులు చలపతి, సాగర్‌, ఆకాంక్షిత, జిల్లా బ్లాక్‌ సమన్వయకర్త బాలరాజు తదితరులు పాల్గొన్నారు.

పాఠశాలలను గుర్తింపు సాధించడం గర్వకారణం

ఆసిఫాబాద్‌, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి): కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా నిర్వహించిన స్వచ్ఛ్‌ ఎవం హరిత్‌ విద్యాలయ రేటింగ్‌ 2025-26 కార్యక్రమంలో జిల్లాలోని పాఠశాలలు ప్రతిష్టాత్మకంగా గుర్తింపు సాధించడం గర్వకారణమని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల కలెక్టర్‌ చాంబర్‌లో ప్రత్యేక గుర్తింపు పొందిన పాఠశాలల ప్రతినిధులకు అదనపు కలెక్టర్‌, ఇనచార్జి డీఈవో దీపక్‌ తివారితో కలిసి శనివారం ధ్రువపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కేంద్ర విద్యా శాఖ నిర్వహించిన రేటింగ్‌ కార్యక్రమంలో జిల్లాలోని సావరఖేడ గ్రామ ప్రధాన మంత్రి శ్రీ మండల్‌ పరిషత్‌ ప్రాథమిక పాఠశాల, చిన్నరాస్పెల్లి గ్రామంలోని ప్రధాన మంత్రి శ్రీ జిల్లా పరిషత ఉన్నత పాఠశాల, రెబ్బెన, కౌటాల మంలాల్లో కేజీబీవీ, దహెగాం మండలం రాంపూర్‌ గ్రామ మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల, కాగజ్‌నగర్‌ పట్టణంలోని అరుణోదయ ఉన్నత పాఠశాలలు ప్రత్యేక గుర్తింపు సాధించాయని తెలిపారు. విద్యా సంస్థలు కేవలం విద్యాబోధనకే పరిమితం కాకుండా పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, హరిత జీవన విధానాలపై విద్యార్థులలో అవగా హన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం ద్వారా విద్యార్థులలో బాధ్యతాయుత పౌరులుగా మారే లక్షణాలు పెంపొందుతాయని తెలిపారు. వీటి వినియోగంలో మిత వ్యయం, మరుగుదొడ్లు నిర్వహణ, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ప్రవర్తన మార్పు, మిషన్‌ లైఫ్‌ కార్యక్రమాల అమలులో పాఠశాల అత్యుత్తమ ప్రమాణాలు సాధించి ఆదర్శంగా నిలిచాయని తెలిపారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి జీఎంవో మధుకర్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 20 , 2025 | 10:07 PM