Share News

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలి

ABN , Publish Date - Dec 02 , 2025 | 10:43 PM

ఇందిరమ్మ ఇళ్ల పనుల వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రకాష్‌రావులతో కలిసి కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై మున్సిపల్‌, గృహ నిర్మాణ, మున్సిపల్‌ వార్డు అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్లను వేగవంతం చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌, డిసెంబరు 2 (ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల పనుల వేగవంతం చేయాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, గృహ నిర్మాణ శాఖ అధికారి ప్రకాష్‌రావులతో కలిసి కాగజ్‌నగర్‌, ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీ పరిధిలో చేపట్టాల్సిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపై మున్సిపల్‌, గృహ నిర్మాణ, మున్సిపల్‌ వార్డు అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మున్సిపాలిటీలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను ప్రతి లబ్ధిదారులు ప్రారంభించేలా మున్సిపల్‌, గృహ నిర్మాణ, మున్సిపల్‌ వార్డు అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. కాగజ్‌నగర్‌ మున్సిపాలిటీకి 498 ఇళ్లు మంజూరు చేశామని అన్నారు. ఇప్పటి వరకు 391 ఇళ్ల పనులు ప్రారంభించారని అన్నారు. మిగిలిన 107 మంది లబ్ధిదారులు పనులు చేపట్ట లేదని తెలిపారు. ఇందుకు గల కారణాలను తెలుసుకొని పనులు ప్రారంభించేందుకు మెప్మా కింద మహిళల సంఘాల నుంచి రుణసదుపాయం అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఆసిఫాబాద్‌ మున్సిపాలిటీకి 458 ఇల్లు మంజూరు కాగా ఇంకా 105 పారరంభించలేదని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల్ల నిర్మాణానికి ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందిస్తుందని, ఈ నెల 20వ తేదీలోగా పూర్తి అయిన ఇళ్లకు ప్రారంభోత్సవాలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. అధికారులు సమన్వయంతో పని చేసి పనులు ప్రారంభించని ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో మాట్లాడి త్వరగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ డీఈ వేణుగోపాల్‌, మున్సిపల్‌ కమీషనర్లు, గృహ నిర్మాణ శాఖ ఇంజనీరింగ్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2025 | 10:43 PM