అర్హులైన వారందరికీ ఇందిరమ్మ ఇండ్లు
ABN , Publish Date - Apr 04 , 2025 | 11:16 PM
నిరుపేదలకు సొంతింటి పథకం కింద ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని బెల్లం పల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి అన్నారు. మండలంలో ఇందిర మ్మ ఇండ్ల పైలెట్ ప్రాజెక్టు కింద బుగ్గగూడెం గ్రామాన్ని ఎంపిక చేయగా శుక్రవారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

-బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి
కాసిపేట, ఏప్రిల్ 4 (ఆంధ్రజ్యోతి) : నిరుపేదలకు సొంతింటి పథకం కింద ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన వారందరికీ మంజూరు చేస్తామని బెల్లం పల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌వెంకటస్వామి అన్నారు. మండలంలో ఇందిర మ్మ ఇండ్ల పైలెట్ ప్రాజెక్టు కింద బుగ్గగూడెం గ్రామాన్ని ఎంపిక చేయగా శుక్రవారం కలెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తుందని, నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను అందజేస్తామన్నారు. అనం తరం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఏర్పాటు చేసిన మెగా వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే, కలెక్టర్ ప్రారంభించారు. కలెక్టర్ కుమార్ దీపక్ మా ట్లాడుతూ వైద్య ఆరోగ్య సేవలను ప్రజలందరు సద్వినియోగం చేసుకోవా లన్నారు. వైద్య శిబిరం నిర్వహించిన నిర్వహకులను కలెక్టర్ అభినందిం చారు. ఈశిబిరంలో 98 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అత్యవసర వై ద్యం అవసరం ఉన్న వారిని మంచిర్యాల ఆసుపత్రికి రెఫర్ చేసినట్లు తెలి పారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఓ కిషన్, డీఎంహెచ్‌వో సుధాకర్‌నాయక్, తహసీల్దార్ భోజన్న, ఎంపీడీవో సత్యనారాయణసింగ్, మెడిలైఫ్ ఆసుపత్రి డాక్టర్ కంటం కుమారస్వామి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ రమణ, స్ధానిక వైద్య సిబ్బంది , ఆశా కార్యకర్తలు , ఆర్‌బీఎస్‌కే సిబ్బంది, నాయకులు పాల్గొన్నారు.