Share News

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్లకు ధరల భారం

ABN , Publish Date - Jul 15 , 2025 | 10:47 PM

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు భారంగా మారింది. ముడి సరుకుల ధరలు అమాంతం పెరుగ డంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.

kumaram bheem asifabad- ఇందిరమ్మ ఇళ్లకు ధరల భారం
నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇల్లు

- అడ్డ కూలీలకు డిమాండ్‌

- ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం రూ. 5 లక్షలు

- అదనంగా రూ. 4 లక్షల వరకు ఖర్చు

- ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారుల వినతి

ఇందిరమ్మ ఇంటి నిర్మాణం లబ్ధిదారులకు భారంగా మారింది. ముడి సరుకుల ధరలు అమాంతం పెరుగ డంతో లబ్ధిదారుల్లో ఆందోళన నెలకొంది.

ఆసిఫాబాద్‌రూరల్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): పెరిగిన స్టీలు, సిమెంట్‌, ఇసుక ధరలతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణదారులపై భారం పడుతోంది. ఇళ్ల నిర్మాణాలు గాడిన పడుతున్న తరుణంలో సామగ్రి రేట్లు అధికం కావడం ప్రతిబంధకంగా మారింది. వీటికి తోడు కంకర, కూలీ రేట్లు సైతం పెరిగిపోయాయి. పెరిగిన దరలను బట్టి ఒక్కొక్క ఇంటిపై రూ. 3 నుంచి 4 లక్షల వరకు అదనపు బారం పడేలా ఉందని లబ్దిదారులు వాపోతున్నారు.

- మొదటి విడతలో..

జిల్లాకు మొదటి విడతలో 1.669 ఇళ్లు మంజూర య్యాయి. ఇందులో సుమారు వేయి ఇళ్ల పనులకు ముగ్గు పోశారు. 300 ఇళ్లు పునాదుల దశను పూర్తి అయ్యాయి. ఇందులో 80 మంది లబ్ధిదారులకు రూ. లక్ష బిల్లు చెల్లించారు. ప్రభుత్వం విడతల వారీగా లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ దశలను పట్టి రూ. ఐదు లక్షల సహాయం అందజేస్తోంది. జిల్లాలోని 15 మండ లాల్లో మోడల్‌ ఇందిరమ్మ ఇళ్ల పనులు కొనసాగుతు న్నాయి. ఇందులో కొన్ని పూర్తయ్యాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి.

- ఐదు వందలకు పైగా..

ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి 500 నుంచి 525 బస్తాలు అవసరముంటుంది. నెల రోజుల క్రితం బస్తా ధర రూ. 280 ఉండగా ప్రస్తుతం గ్రేడ్‌ను బట్టి ఒక్కొ బస్తాపై రూ. 50 నుంచి రూ. 80 వరకు విక్రయిస్తు న్నారు. పాత ధర ప్రకారం రూ. 1.47 సిమెంట్‌ ఖర్చు వచ్చేది. ప్రస్తుత రేటును బట్టి బస్తాకు అదనంగా రూ. 50 అదనంగా వేసుకున్న రూ. 1.73,250 అవుతుంది. ఈ లెక్కన ఒక్కో లబ్ధిదారుడిపై సిమెంట్‌ రూపేణా రూ. 26,250 వరకు అదనపు భారం పడుతుంది. బస్తాకు రూ. 80 అయితే రూ. 1,89 అవుతుంది. స్టీల్‌ ధర కంపెనీ బట్టి గతంలో క్వింటాలుకు కనిష్ఠంగా రూ. 5,500 ఉండగా ఇప్పుడు గరిష్ఠంగా రూ. 7,800కు చేరింది. ఇంటి నిర్మాణానికి కనీసం 1.5 టన్నుల సిమెంట్‌ పడుతుందని లబ్ధిదారులు చెబుతున్నారు. రూ. 5,500 చొప్పున స్టీలుకు రూ. 82,500 అవు తుండగా సగటున క్వింటులుకు రూ. 7500 రొప్పున రూ. 1,12,500 ఖర్చు అవుతుంది. ఈ లెక్కన రూ. 30 వేల వరకు అదనపు భారం పడుతుంది.

- అందని ఉచిత ఇసుక..

ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా సరఫరా చేయా ల్సి ఉంది. కానీ ట్రాక్టర్ల యాజ మానులు నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు. ట్రిప్పు ఇసుకకు రూ. 1.600 నుంచి రూ. 2 వేల వరకు తీసుకుంటూ సరఫరా చేస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ముందు ట్రాక్టర్‌ ఇసుక ఏరియాను బట్టి రూ. వేయి నుంచి రూ. 1,200 వరకు సరఫరా చేసేవారు. ఇళ్ల నిర్మాణాల నేపథ్యంలో అదును చూసి ధరలు అమంతంగా పెంచే శారని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు. ఇక కంకర విషయానికి వస్తే అదే పరిస్థితి నెలకొంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు ఉపందుకుంటున్న నేపథ్యం లో అడ్డ కూలీలకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. ఇండ్ల నిర్మాణాలతో తాపి మేస్త్రీ, కూలీలకు చేతి నిండా పని ఉండడంతో కొన్ని ప్రాంతాలలో మేస్త్రీలు దొరకక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో మేస్త్రీకి రూ. 600 నుంచి 800 ఉండగా ప్రస్తుతం రూ. 800 నుంచి రూ. వేయి వరకు కూలీ చెల్లించాల్సి వస్తుంది. కూలీలకు రోజుకు రూ. 500 నుంచి 600 వర కు చెల్లించాల్సి వస్తున్నదని లబ్ధిదారులు చెబుతున్నారు. ప్రభుత్వం ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Updated Date - Jul 15 , 2025 | 10:47 PM