అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలి
ABN , Publish Date - Mar 13 , 2025 | 10:47 PM
ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దేశ్యానాయక్ అన్నారు.

- సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దేశ్యానాయక్
అచ్చంపేటటౌన్/ తెలకపల్లి/ వంగూరు, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) : ఇళ్లు లేని పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు దేశ్యానాయక్ అన్నారు. పట్టణంలో నివాసముంటున్న పేదలందరికీ ఇంటిస్థలాలు ఇంచి ఇందిరమ్మ ఇళ్లు నిర్మించాల ని కోరుతూ గురువారం పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముం దు ధర్నా నిర్వ హించి ఆర్డీవో మా ధవికి విన తిపత్రం అందజేశారు. ఆ యన మాట్లాడు తూ గతంలో ఇళ్ల స్థలాలు పేదలకు పంపిణీ చేశారని, వాళ్లకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు చే పట్టాలని కోరారు. కార్యక్రమంలో సీపీ ఎం జిల్లా నాయకులు శంకర్ నాయక్, నిర్మల, సైదులు, సయ్యద్, శివకుమార్, రాములు, మధు పాల్గొన్నారు.
ఫ తెలకపల్లి మండలం ఆలేరు గ్రామంలో సీపీఎం నాయకుడు చిటికెల రామకృష్ణ సర్వే చేశారు. అర్హత కలిగిన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని కోరారు. ఉపాధి హామీ పథకానికి కేంద్రంలో ప్రతీ సంవత్సరం బడ్జెట్ తగ్గిస్తూ రావడం వల్ల కూలీలకు కూలి గిట్టుబా టు కావడం లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామ శాఖ కార్యదర్శి కొంగరి కాశన్న, బాలస్వామి, కుర్మయ్య, ప్రసాద్, కుర్మయ్య, పర్వతాలు పాల్గొన్నారు.
ఫ వంగూరు మండలం సర్వారెడ్డిపల్లి గ్రామంలో సీపీఎం మండల కార్యదర్శి బాలస్వా మి ఆధ్వర్యంలో గ్రామ సమస్యలపై సర్వే చేశా రు. ఆయన మాట్లాడుతూ పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. తండాలో తాగు నీటి ఎద్దడిని నివారించాలని కోరారు.