అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు
ABN , Publish Date - Apr 05 , 2025 | 11:14 PM
అర్హులైన ప్ర తి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామ ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అ న్నారు. ఇందిరమ్మ ఇండ్ల పైలెట్ ప్రాజెక్టు కింద మం డలంలోని బొప్పారం గ్రామం ఎంపిక కాగా శని వా రం కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ ఎమ్మెల్సీ పురా ణం సతీష్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇం డ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు.

-మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా
-ఎమ్మెల్యే వివేక్‌వెంకటస్వామి
కోటపల్లి, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి) : అర్హులైన ప్ర తి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామ ని చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్‌వెంకటస్వామి అ న్నారు. ఇందిరమ్మ ఇండ్ల పైలెట్ ప్రాజెక్టు కింద మం డలంలోని బొప్పారం గ్రామం ఎంపిక కాగా శని వా రం కలెక్టర్ కుమార్ దీపక్, మాజీ ఎమ్మెల్సీ పురా ణం సతీష్‌కుమార్‌తో కలిసి ఎమ్మెల్యే ఇందిరమ్మ ఇం డ్ల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభు త్వం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను, ఇతర హా మీలను నెరవేరుస్తుందన్నారు. నిరుపేదలకు సొం తింటి కల నెరవేరబోతుందని ఆయన పేర్కొన్నారు. అలాగే మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తా నన్నారు. నక్కలపల్లి దారిలో రోడ్డు, బ్రిడ్జి నిర్మాణానికి త్వరలోనే అటవీ శాఖ అనుమతులు తీసుకువచ్చి ని ర్మాణం చేపడతామన్నారు. బావనపల్లి గ్రామంలో తాగునీటి సమస్యను త్వరలోనే తీరుస్తామన్నారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన బొప్పారం గ్రామం లో ఇందిరమ్మ ఇండ్ల లబ్దిదారులతో మాట్లాడిన ఎ మ్మెల్యే ఇండ్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని కోరారు. అంతకుముందు కోటపల్లి మండల కేంద్రం లో డీఎంఎఫ్‌టీ నిధులతో చేపట్టే సీసీ రహదారి ని ర్మాణానికి భూమి పూజ చేశారు. నక్కలపల్లిలో అట వీ కుక్కల దాడిలో మేకలు మృతిచెందిన ఘటనలో బాధితుడైన ముల్కల్ల వెంకటికి ప్రభుత్వం ద్వారా మంజూరైన రూ. 6 లక్షల చెక్కును ఎమ్మెల్యే అంద జేశారు. బొప్పారంలో కల్యాణలక్ష్మి చెక్కులను పంపి ణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ మూల రాజిరెడ్డి, మాజీ జడ్పీటీసీ పోటు రాం రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు కేవీ ప్రతాప్, మాజీ సింగిల్ విండో చైర్మన్ బాపురెడ్డి, తహసీల్దార్ రాఘవేందర్‌రావు, ఎంపీడీవో లక్ష్మయ్య, కాంగ్రెస్ నా యకులు మహేష్ ప్రసాద్‌తివారీ, భూషణ్‌శర్మ, లక్ష్మ ణ్‌గౌడ్ పాల్గొన్నారు.