అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Jul 06 , 2025 | 11:30 PM
అర్హు లైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తా మని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివే క్‌వెంకటస్వామి అన్నారు. ఆదివారం చెన్నూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసిడింగ్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పత్రాలను అందజే శారు.
-మంత్రి వివేక్‌వెంకటస్వామి
చెన్నూరు, జూలై 6 (ఆంధ్రజ్యోతి) : అర్హు లైన ప్రతి లబ్ధిదారునికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తా మని రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి వివే క్‌వెంకటస్వామి అన్నారు. ఆదివారం చెన్నూరు లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పా టు చేసిన ఇందిరమ్మ ఇళ్ల ప్రొసిడింగ్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్‌దీపక్‌తో కలిసి లబ్ధిదారులకు ప్రొసిడింగ్ పత్రాలను అందజే శారు. మంత్రి మాట్లాడుతూ నియోజకవర్గం లో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇ స్తామన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను సీఎం రేవంత్‌రెడ్డి అమలు చేస్తు న్నారన్నారు. మైనింగ్ శాఖ మంత్రి అయ్యాక రికార్డులను పరిశీలిస్తున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో కేవలం ఇసుక రవాణా మీద రూ. 600 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. కొంత మంది బీఆర్‌ఎస్ నాయకులు పనిగట్టుకుని ఇ సుక అక్రమ రవాణా జరుగుతుందని సోష ల్ మీడియాలో ఫేక్ పోస్టులు పెడుతున్నారని, ఇ లాంటి వారిపై పోలీసులు కఠిన చర్యలు తీ సుకోవాలన్నారు. అనంతరం మంచిర్యాల -చె న్నూరు రూట్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన 5 ఆర్టీసీ బస్సులను మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ము రళీకృష్ణ, ఆర్టీసీ డిపో మేనేజర్ జనార్దన్, అ ధి కారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్త లు పాల్గొన్నారు.
అన్ని వర్గాల అభ్యున్నతి, ప్రజాపాలనే ప్ర భుత్వ ధ్యేయం
కోటపల్లి : అన్ని వర్గాల అభ్యున్నతి, ప్రజా పాలనే ప్రభుత్వ ధ్యేయమని కార్మికశాఖ, ఉపా ధి, మైనింగ్ శాఖల మంత్రి వివేక్‌వెంకట స్వా మి అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని పౌరసరఫరాల శాఖ గోదాంల ఆవరణలో నిర్వ హించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మంజూ రు పత్రాల సభలో ఆయన మాట్లాడారు. మం డలంలో ఇప్పటికే మురుగుకాలువల నిర్మా ణం, సీసీ రహదారుల నిర్మాణం పూర్తి చేశా మని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పిం చామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు అం దిస్తుందన్నారు. అనంతరం 429 మంది లబ్ధి దారులకు ఇళ్ల మంజూరు పత్రాలను అందజే శారు. అంతకుముందు గోదాంల ఆవరణలో క లెక్టర్ కుమార్ దీపక్‌తో కలిసి మొక్కలు నా టారు. ఆ తర్వాత ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో రోగులకు శుద్దజలం అందించేందుకు ఏర్పా టు చేసిన ఆర్‌వో ప్లాంట్‌ను ఆయన ప్రారం భించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, డీఆర్‌డీవో కిషన్, ఎంపీడీవో లక్ష్మయ్య, తహసీల్దార్ రాఘ వేందర్‌రావు, సీఐ బన్సీలాల్, ఎస్‌ఐ రాజేందర్, మాజీ జెడ్పీటీసీ పోటు రాంరెడ్డి, పార్టీ మండ ల అధ్యక్షుడు మహేష్ ప్రసాద్, సింగిల్ విండో మాజీ చైర్మన్, బాపురెడ్డి, నాయకులు ఆలూరి సంపత్, దుర్గం వెంకటస్వామి పాల్గొన్నారు.