అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Dec 20 , 2025 | 11:18 PM
అర్హులందరికీ ఇం దిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు.
- లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి
కల్వకుర్తి, డిసెంబరు 20 (ఆంధ్రజ్యోతి) : అర్హులందరికీ ఇం దిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి హామీ ఇచ్చారు. అ ర్హుల జాబితాను సిద్ధం చేసి తనకు నివేదిస్తే సీఎంతో మాట్లాడి ఇళ్ల మంజూరుకు కృషిచేస్తానని పేర్కొ న్నారు. కల్వకుర్తి పట్టణంలోని ఎ మ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 66 మంది ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూ రు పత్రాలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. అం తకు ముందు రూ.3 కోట్ల 20 లక్షలతో కల్వకుర్తి నుంచి కుర్మిద్దతండా వరకు నిర్మించే బీటీ రోడ్డు నిర్మాణానికి, పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల, విద్యానగర్ స్కూల్, బాలికల హైస్కూల్, ప్రభు త్వ పాఠశాల జడ్పీ బాలుర స్కూళ్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జరిగిన సమా వేశంలో ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి మా ట్లాడారు. కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యుడు ఠాకూర్ బాలాజీసింగ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు బృంగి ఆనంద్‌కుమార్, మునిసిపల్ కమిషనర్ మహమ్మద్ షేక్, మా ర్కెట్ కమిటీ డైరెక్టర్లు పసుల రమాకాంత్‌రెడ్డి, మసూద్, పట్టణ అధ్యక్షుడు చిమ్ముల శ్రీకాంత్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కాయితీ విజయ్ కుమార్‌రెడ్డి, నాయకులతో పాటు శంకుస్థాపన కార్యక్రమంలో పీఆర్ డిప్యూటీ ఈఈ బసవ లింగం, పలువురు అధికారులు ఆయా గ్రామా ల సర్పంచ్ ఆంజనేయులు, భీమ్లానాయక్ పా ల్గొన్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లను ఎమ్మెల్యే తన క్యాంపు కార్యాలయంలో సత్కరించారు.