Share News

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు

ABN , Publish Date - Sep 04 , 2025 | 11:32 PM

రాష్ట్రంలోని అర్హు లందరికీ ఇందిరమ్మ ఇల్లు మం జూరు చేస్తామని పర్యాటక, ఎక్సై జ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వుఅన్నారు.

అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
కొల్లాపూర్‌లో ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులకు ప్రొసీడింగ్‌ అందజేస్తున్న మంత్రి జూపల్లి కృష్ణారావు

- మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడి

కొల్లాపూర్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలోని అర్హు లందరికీ ఇందిరమ్మ ఇల్లు మం జూరు చేస్తామని పర్యాటక, ఎక్సై జ్‌ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారా వుఅన్నారు. గురువారం కొల్లాపూ ర్‌ పట్టణంలోని ఒకటో వార్డులో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు మంజూరు పత్రాలను మంత్రి అందించారు. అదేవిధంగా ఇంటి నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప దేళ్ల బీఆర్‌ఎస్‌ పరిపాలనలో మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్‌ నిరుపేదలకు ఒక్క డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇల్ల్లు కూడా కేటాయించలేదని ఆరోపిం చారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ పాలనలో ముఖ్యమం త్రి రేవంత్‌రెడ్డి గృహ నిర్మాణం కోసం రూ.5ల క్షలు మంజూరు చేస్తున్నారని అన్నారు. అదేవి ధంగా 16,17వ వార్డుల్లో మునిసిపల్‌ మాజీ కౌ న్సిలర్లు, పార్టీ నాయకులు లబ్ధిదారులకు మం జూరు పత్రాలు పంపిణీ చేశారు. పలు చోట్ల ఇంటి నిర్మాణానికి భూమి పూజ చేశారు. కార్య క్రమంలో మునిసిపల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌ రావు, హౌసింగ్‌ ఏఈ రాజవర్ధన్‌రెడ్డి, కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు నరసింహారావు, నాయకు లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 04 , 2025 | 11:32 PM