అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు
ABN , Publish Date - Jun 17 , 2025 | 11:11 PM
అర్హులైనవారందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగవారం పట ్టణంలోని పదవ వార్డులో మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేసి మాట్లాడా రు. నియోజకవర్గంలో 3500 ఇళ్లను మంజూరు చేశామని మరో విడతలో పూర్తి స్థాయిలో మంజూరవుతాయన్నారు.
బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్
బెల్లంపల్లి,జూన్17(ఆంధ్రజ్యోతి): అర్హులైనవారందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంగవారం పట ్టణంలోని పదవ వార్డులో మాజీ కౌన్సిలర్ బండి ప్రభాకర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ప్రోసిడింగ్ పత్రాలను అందజేసి మాట్లాడా రు. నియోజకవర్గంలో 3500 ఇళ్లను మంజూరు చేశామని మరో విడతలో పూర్తి స్థాయిలో మంజూరవుతాయన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిర మ్మ ఇళ్లతో పేద వారికి గూడు సాకారం అవుతుందన్నారు. ఇల్లు నిర్మించు కున్నవారికి నాలుగు విడతల్లో 5లక్షల రూపాయలు మంజూరవుతాయని, ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపికలో ఎలాంటి రాజకీయ జోక్యం లేకుం డా పారదర్శకంగా జరిగిందన్నారు. అనంతరం పట్టణంలోని గాంధీ విగ్ర హం నుంచి పోచమ్మ దేవాలయం వరకు రూ.2కోట్లతో బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే కన్నాల బస్తీలో కోటి రూపాయల సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులకు, పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం నుంచి ఎఎంసీ చౌరస్తా వరకు రూ.2కోట్ల నిధులతో రహదారి వెడల్పు ప నులు, సెంట్రల్ లైటింగ్ పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో హరిక్రిష్ణ, నాయకులు కారుకూరి రాంచందర్, ముచ్చర్ల మల్లయ్య, సిలుముల శంకర్, మునిమంద రమేశ్, గెల్లి రాజలింగు, రాములు నాయక్, తదితరులు పాల్గొన్నారు.