Share News

Tummala Nageswara Rao: భవిష్యత్తులో భారత్‌ ఆఫ్రికా వ్యవసాయ బంధం బలోపేతం

ABN , Publish Date - Sep 12 , 2025 | 04:28 AM

భవిష్యత్తులో భారత్‌- ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయ రంగ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని...

Tummala Nageswara Rao: భవిష్యత్తులో భారత్‌ ఆఫ్రికా వ్యవసాయ బంధం బలోపేతం

  • దేశానికి విత్తన హబ్‌గా తెలంగాణ

  • ఇండియా- ఆఫ్రికా సీడ్‌ సమ్మిట్‌లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్‌, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో భారత్‌- ఆఫ్రికా దేశాల మధ్య వ్యవసాయ రంగ సంబంధాలు మరింత బలోపేతమవుతాయని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. హైదరాబాద్‌లో గురువారం నిర్వహించిన ‘ఇండియా- ఆఫ్రికా సీడ్‌ సమ్మిట్‌- 2025’లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. వాణిజ్యపరమైన అంశాలే కాకుండా విత్తన దౌత్యం ద్వారా విశ్వాసాన్ని పెంపొందించుకునేందుకు, శాస్త్త్ర పరిజ్ఞానాన్ని పంచుకునేందుకు, సుస్థిర వ్యవసాయం సమష్ఠిగా కలిసి పనిచేయటానికి ఈ వేదిక దోహద పడుతుందని అన్నారు. తెలంగాణ నుంచి 20కి పైగా దేశాలకు ఎగుమతి చేస్తున్నామని, కఠినమైన నాణ్యత ప్రమాణాలు పాటించటంతో తెలంగాణ విత్తనాలకు గ్లోబల్‌ గుర్తింపు లభించిందని తుమ్మల తెలిపారు. ఆఫ్రికా విత్తన మార్కెట్‌ విలువ 3.99 బిలియన్‌ డాలర్లుగా ఉన్నదని, భారత్‌- ఆఫ్రికా భాగస్వామ్యంతో పరిశోధకులు, రైతులు, విత్తనసంస్థలు లాభపడే అవకాశం ఉంటుందని అన్నారు.

Updated Date - Sep 12 , 2025 | 04:28 AM