Share News

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికులకు పనిగంటల పెంపు

ABN , Publish Date - Apr 22 , 2025 | 12:48 AM

దేశంలో బీజేపీపాలిత రాష్ట్రాల్లో కార్మికులకు పనిగంటల పెంపు, లేబర్‌కోడ్‌లతో కార్మికులను బానిసలు మార్చేందుకు కుట్రలు పన్నుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌ బాబు అన్నారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌ శుక్లా కార్మిక భవనంలో సోమవారం మేడే సందర్భంగా సీపీఎం అధ్వర్యంలో

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కార్మికులకు పనిగంటల పెంపు
సిరిసిల్లలో మేడే కరపత్రాలను ఆవిష్కరిస్తున్న సీపీఎం నాయకులు

సిరిసిల్ల రూరల్‌, ఏఫ్రిల్‌ 21 (అంధ్రజ్యోతి): దేశంలో బీజేపీపాలిత రాష్ట్రాల్లో కార్మికులకు పనిగంటల పెంపు, లేబర్‌కోడ్‌లతో కార్మికులను బానిసలు మార్చేందుకు కుట్రలు పన్నుతుందని సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌ బాబు అన్నారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌ శుక్లా కార్మిక భవనంలో సోమవారం మేడే సందర్భంగా సీపీఎం అధ్వర్యంలో రూపొందించిన కరపత్రాలను సీపీఎం నాయకులతో కలిసి రాష్ట్ర కమిటీ సభ్యుడు స్కైలాబ్‌బాబు ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా జరిగిన సమావేశంలో అయన మాట్లాడుతూ కార్మిక చట్టాలను రద్దు చేస్తు నాలుగు లేబర్‌ కోడ్‌లను తీసుకరావటమే కాకుండా కార్మికుల హక్కులను కాలరాస్తున్న బీజేపీ విధానాలపై కార్మికుల ఉద్యమాలను చేపట్టాలని మేడే సందర్భంగా అంతర్జాతీయ శ్రామిక దినోత్సవాన్ని గ్రామాలతో పాటు అన్ని వార్డులల్లో ఎర్రజెండాలను ఎగురవేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక చట్టాల సవరణ ద్వారా కార్మికులను యజమానులకు పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చే కుట్ర జరుగుతుందన్నారు. కార్మిక చట్టాలను సవరణ చేస్తే 8 గంటల స్థానంలో 12 గంటల పనిదినాలు అమలు అవుతాయని అన్నారు కార్మికులపై పని గంటలు పెంచి పెట్టుబడిదారులకు ఆదాయాన్ని సమకూర్చడానికి కేంద్ర మే లేబర్‌ కోడ్‌లను తీసుకొస్తున్నదని విమర్శించారు. కార్మికవర్గం కార్మిక చట్టాల సవరణపై తిరగబడకపోతే కార్మికులు యజమానులు పెట్టుబడిదారులకు బానిసలుగా మారాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. మే 1న అంతర్జాతీయ కార్మిక కష్ట జీవుల దినోత్సవాన్ని గ్రామ గ్రామాన వాడవాడలా ఎర్రజెండాలు ఎగురవేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శి మూశం రమేష్‌ అధ్యక్షత వహించగా సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి. జవ్వాజి విమల, కోడం రమణ మల్లారపు అరుణ్‌ కుమార్‌ జిల్లా కమిటీ సభ్యులు గన్నేరం నర్సయ్య అన్నల్దాస్‌ గణేష్‌ సూరం పద్మ రమేష్‌ చంద్ర వివిధ ప్రజా సంఘాల నాయకులు రామంచ అశోక్‌ సిరిమల్లె సత్యం. కుమ్మరి కుంట కిషన్‌,నరేందర్‌ ఎస్‌ రాములు దినకర్‌ నక్క దేవదాస్‌ సురేష్‌ కమలాకర్‌, జగదీష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 22 , 2025 | 12:48 AM