Share News

kumaram bheem asifabad- పెరిగిన కూరగాయల ధరలు

ABN , Publish Date - Nov 25 , 2025 | 11:17 PM

ఇటీవల కూరగాయల ధరలు వివరీతంగా పెరిగాయి. ఏదీ కొందమన్నా కిలో రూ. 100కుపైగా పలుకుతన్నాయి. ఏం కొనెటట్టు లేదు...ఏం తినేటట్టు లేదు. అన్నట్లుగా ఉంది సామాన్యుల పరిస్థితి. పట్టణ ప్రాంతాలే కాకుండా పల్లెల్లో సైతం ప్రస్తుతం కూరగాయలు కొనే పరిస్థితి లేదు. తుఫాన్‌ కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడంతో దిగుబడులు భారీగా తగ్గాయి.

kumaram bheem asifabad- పెరిగిన కూరగాయల ధరలు
కూరగాయలు విక్రయిస్తున్న చరు వ్యాపారులు

-పేద, మధ్యతరగతి ప్రజలు బెంబేలు

వాంకిడి, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కూరగాయల ధరలు వివరీతంగా పెరిగాయి. ఏదీ కొందమన్నా కిలో రూ. 100కుపైగా పలుకుతన్నాయి. ఏం కొనెటట్టు లేదు...ఏం తినేటట్టు లేదు. అన్నట్లుగా ఉంది సామాన్యుల పరిస్థితి. పట్టణ ప్రాంతాలే కాకుండా పల్లెల్లో సైతం ప్రస్తుతం కూరగాయలు కొనే పరిస్థితి లేదు. తుఫాన్‌ కారణంగా ఇటీవల కురిసిన వర్షాలకు కూరగాయల పంటలు దెబ్బతినడంతో దిగుబడులు భారీగా తగ్గాయి. దీంతో ప్రజల అవస రాలకు సరిపడా కూరగాయలు అందుబాటులో లేకపోవడంతో మార్కెట్లో ధరలు అమాంతం పెరిగా యి. గత వారం క్రితం ఉన్న ధరలు ప్రస్తుతం రూ. 20కు పెరిగాయి. గత నాలుగు రోజుల క్రితం రూ. 40 కిలో ఉన్న టమాట ప్రసుత్తం రూ. 80 కి చేరింది. చిక్కుడు, పచ్చిమిర్చి, కాకరకాయ, క్యాబేజీ, బెండకా య, క్యాప్సికం, పాలకూర, తోట కూర ఇలా అన్నింటికి ధరలు వందరూపాయలకు పైగా పలుకుతున్నాయి. జిల్లాలో కూరగాయల సాగు కూడా ఎక్కువగా లేకపోవడంతో కూరగాయల ధరలు రోజు రోజుకు అమాంతం పెరుగుతున్నాయి. దీనికి తోడు ఈ వానకాలంలో భారీ వర్షాలు కురియడంతో చాలా చోట్ల పంటలు దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో ఉన్న కూరగాయలు, ఆకుకూరల దిగుబడిపై తూఫాన్‌ తీవ్ర ప్రభావం చూపింది.

- తగ్గుతున్న సాగు..

జిల్లాలో ఏటేటా కూరగాయల సాగు తగుతోంది. జిల్లా వ్యాప్తంగా 4.48 లక్షల ఎకరాలు వివిద పంట లు సాగవుతుండగా అత్యధికంగా 3.30 లక్షల ఎకర ల్లో పత్తి సాగుచేస్తున్నారు. కేవలం 7.800 ఎకరాల్లో మాత్రమే కూరగాయల సాగు ఉంది. ఆ తర్వాత కంది, వరి పంటలను రైతులు సాగు చేస్తున్నారు. రైతులు వాణిజ్య పంటలకే ప్రాధాన్యత ఇస్తుండడంతో కూరగాయల పంటల సాగుపై రైతులు మక్కువ చూరడంలేదు. జిల్లాలో కూరగాయల సాగు అత్యధి కంగా లేకపోవడంతో ఇతర ప్రాంతాల ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి రావడంతో కూరగాయ ధరలు భగ్గుమంటున్నాయి. దీంతో పేద, మద్య తరగతి ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతున్నది.

- సామాన్యులపై తీవ్ర ఆర్థిక భారం

రోజు రోజుకు పెరుగుతన్న ధరలు సామన్య ప్రజలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. ప్రతి కూరలో టమాటా తప్పని సరి ఉంటుంది. ప్రస్తుతం టమాటా ధర రూ. కిలో 80 పలుకు తుండగా పచ్చి మిర్చి కిలో రూ. 120 ఉంది. వంటకాల్లో ఇవి రెండు తప్పని సరికావడంతో కూరల్లో టమాట , పచ్చి మిర్చి వాడకంకూడా తగ్గించే పరిస్థితితులు వ చ్చాయి. కూరగాయలు కొందామని మార్కెట్‌కు వెళ్తే ఒకరి, రెం డు రోజులకు సరిపడా కూరగాయాలు మాత్రమే కొనుగోలు చేస్తున్నామని ప్రజలు చెబుతున్నారు.

ధరలు విపరీతంగా పెరిగాయి....

చిందం రాజు- వాంకిడి

గత వారు రోజుల కిందటి వరకు కూరగాయలు కొంచేం తక్కువ ధరలోనే దిరికాయి. ఈ వారం పది రోజుల ననుంచి విపరీతంగా ధరలు పెరిగాయి. ఏ కూరగాయ కొందామన్నా కిలో రూ. 100కు పైనే ఉంది. రోడ్ల పక్కన పెట్టి అమ్మె వారి దగ్గర ఇంకా ఎక్కువగా ధరలు ఉంటున్నాయి. ఎండా కాలంలో పలికే ధరలు ఇప్పుడు పలుకుతున్నాయి. ధరలు ఇలాగే ఉంటే రోజు కూలీ చేసుకుని బతికే వాళ్లకు కష్టమే.

------------------------------------------------

జిల్లా కేంద్రంలో కూరగాయల ధరలు ఇలా..

కిలో రూ. లలో

--------------------------------------------

టమాటా 80

గోబి 100

అలుసంద 100

బెండ 100

చిక్కుడు 100

క్యాప్సికాం 100

బీరకాయ 80

వంకాయ 80

పాలకూర 100

తోటకూర 100

కాకరకాయ 100

బబ్బర్లు 100

మునగ 200

Updated Date - Nov 25 , 2025 | 11:17 PM