Share News

పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గించాలి

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:32 PM

కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీ ఎం, సీపీఐ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన కార్య క్రమాలు నిర్వహించారు.

పెంచిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు తగ్గించాలి
జిల్లా కేంద్రంలో నిరసన వ్యక్తం చేస్తున్న సీపీఎం నాయకులు

- జిల్లా కేంద్రంలో సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో నిరసన

నాగర్‌కర్నూల్‌ టౌన్‌/ కల్వకుర్తి/ కొల్లాపూర్‌/ ఉప్పునుంతల/ వంగూరు, ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యో తి) : కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలను వెంటనే తగ్గించాలని సీపీ ఎం, సీపీఐ ఆధ్వర్యంలో వేర్వేరుగా నిరసన కార్య క్రమాలు నిర్వహించారు. సీపీఎం జిల్లా కార్యద ర్శి వర్ధం పర్వతాలు ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని బస్టాండు కూడలిలో కట్టెల పొయ్యి, గ్యాస్‌ సిలిండర్‌తో ఆ పార్టీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. అలాగే జిల్లా కేంద్రంలోని అంబేడ్కర్‌ చౌరస్తాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎం.బాల్‌నర్సింహ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకు లు నిరసన వ్యక్తం చేశారు. ఆయా పార్టీల నా యకులు మాట్లాడుతతూ కేంద్ర ప్రభుత్వం పెం చిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలతో దేశ వ్యాప్తంగా 35 కోట్ల పేద, మధ్య తరగతి వినియోగదారులపై భారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశారు. పెం చిన గ్యాస్‌ ధరలతో గ్రామీణ ప్రాంతాల ప్రజ లకు ఒక్కోసిలిండర్‌పై రూ.930నుంచి రూ.980కి, పట్టణ ప్రాంతాల్లో రూ.855 నుంచి రూ.905కి పెరిగాయని పేర్కొన్నారు. కేవలం గ్యాస్‌ వ్యాపా రులకు అధిక లాభాలు తెచ్చిపెట్టేందుకే పేద, మధ్య తరగతి ప్రజలపై కేంద్రం భారం మోసిం దని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు కేశవులుగౌడ్‌, వార్ల వెంకట య్య, జిల్లా సమితి సభ్యులు శంకర్‌గౌడ్‌, బిజ్జ శ్రీ నివాసులు, మారేడు శివశంకర్‌, ఖాజా పాల్గొ న్నారు. ఫ కల్వకుర్తిలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు బి.ఆంజనేయులు ఆధ్వర్యంలో కల్వకుర్తి తహసీల్దార్‌ ఇబ్రహీంకు వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు. వారికి బీఆర్‌ఎస్‌ నాయకులు మ ద్దతు తెలిపారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు పులిజాల పరశురాములు, నా యకులు చిలుక బాల్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకు లు సంతోషి మల్లేష్‌ పాల్గొన్నారు. ఫ ఉప్పునుం తలలో పెంచిన వంట గ్యాస్‌ ధరలు తగ్గించా లని కోరుతూ పోచమ్మ చౌరస్తాలో సీపీఎం మం డల కార్యదర్శి చింతల నాగరాజు ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఫవంగూరులోని బ్యాంక్‌ చౌ రస్తాలో సీపీఎం మండల కార్యదర్శి బాలస్వామి ఆధ్వర్యంలో రోడ్డుపై కొద్ది సేపు నిరసన వ్యక్తం చేశారు. ఫ అలాగే కొల్లాపూర్‌లో సీపీఐ కొల్లాపూ ర్‌ మండల కార్యదర్శి తుమ్మల శివుడు, పట్టణ కార్యదర్శి ఎండీ యూసుఫ్‌ ఆధ్వర్యంలో స్థానిక ఎన్టీఆర్‌ చౌరస్తాలో సిలిండర్లతో నిరసన తెలి పారు. నాయకులు కురుమయ్య, మొలచింతల పల్లి శాఖ కార్యదర్శి శివుడు పాల్గొన్నారు.

Updated Date - Apr 09 , 2025 | 11:32 PM