గూడెం ఆలయంలో పెరిగిన భక్తుల రద్దీ
ABN , Publish Date - Nov 02 , 2025 | 11:05 PM
కా ర్తీక మాస శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని దండేపల్లి మండలం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయంలో భక్తులతో కార్తీక సందడి నెలకొం ది. ఆదివారం సెలవు దినంకావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే సుమారు వేలాది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు.
దండేపల్లి నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): కా ర్తీక మాస శుద్ధ ద్వాదశిని పురస్కరించుకుని దండేపల్లి మండలం శ్రీసత్యనారాయణస్వామి దేవాలయంలో భక్తులతో కార్తీక సందడి నెలకొం ది. ఆదివారం సెలవు దినంకావడంతో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఉదయం నుంచే సుమారు వేలాది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకున్నారు. గోదావరి నదిలో పుణ్యస్నా నాలు ఆచరించి గంగమ్మ తల్లికి ప్రత్యేక పూ జ ల నడుమ గోదావరి నదిలో కార్తీక దీపాలు వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయానికి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు. భక్తులు కుటుంబ సమేతంగా శ్రీసత్యనారాయణ స్వామి వ్రతాలను నోముకున్నారు. భ క్తులకు మంచినీటి సౌకర్యంతో పాటు అన్నదా నం ఏర్పాటు చేసినట్లు ఈవో శ్రీనివాస్, సూప రింటెండెంట్ శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.
నేటి నుంచి ప్రత్యేక పూజలు
గూడెం సత్యనారాయణస్వామి దేవాలయం లో నవంబర్ 3 నుంచి 5 వరకు కార్తీక పౌర్ణిమి ప్రత్యేక కార్తీక ఉత్సవ పూజలు వేడుకలను ఘ నంగా నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు.
ఫ3న కార్తీకశుద్ధ త్రయోదశి పుసర్కరిం చు కుని విశ్వక్సేణ ఆరాధన, అంకురారోపణము, అ గ్నిప్రతిష్ఠ, నిత్యహవనము, బలిహరణము.
ఫ4న కార్తీకశుద్ధ చతుర్ధశి పురస్కరించుకోని నిత్యహవణము, బలిహరణము.
ఫ5న కార్తీక పౌర్ణమి రోజున నిత్యహవణ ము, బలిహరణము, మహాపూర్ణాహుతి, యజ్ఞప రిసమాప్తి, మహా దాశీర్వచనము, తీర్థప్రసాద వతరణ ప్రత్యేక పూజలను నిర్వహిస్తారు. కా ర్తీక పౌర్ణమి రోజున రాత్రి 9గంటలకు సత్య హ రిశ్ఛ్దంద్ర పారాణికనాటక ప్రదర్శన. కార్తీక పౌర్ణి మి ఉత్సవాలకు దేవాలయాన్ని అన్ని హంగుల తో ముస్తాబు చేస్తున్నారు.