kumaram bheem asifabad- పెరిగిన నేరాలు
ABN , Publish Date - Dec 30 , 2025 | 10:11 PM
ప్రశాం తతకు మారుపేరు గాంచిన ఆసిఫాబాద్ ఏజెన్సీలో క్రమంగా నేరాల శాతం పెరుగుతోంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేరా లను అదుపు చేయడంలో పోలీసులకు సవాళ్లు విసురుతోంది. గత ఏడాదితో పోల్చి చూసినపుడు ఈ ఏడాది నేరాల శాతం పెరిగింది.
- జిల్లాలో 60.23 శాతం పెరిగిన క్రైం రేట్
- గంజాయిపై పోలీసుల ఉక్కుపాదం
- రోడ్డు ప్రమాదాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ఆసిఫాబాద్, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ప్రశాం తతకు మారుపేరు గాంచిన ఆసిఫాబాద్ ఏజెన్సీలో క్రమంగా నేరాల శాతం పెరుగుతోంది. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన నేరా లను అదుపు చేయడంలో పోలీసులకు సవాళ్లు విసురుతోంది. గత ఏడాదితో పోల్చి చూసినపుడు ఈ ఏడాది నేరాల శాతం పెరిగింది. 2024లో 1, 207 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 1,934 కేసు లు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో క్రైం రేట్ 60.23 శాతం పెరిగింది. 2024తో పోలిస్తే 2025లో జిల్లాలో నేర ప్రవృత్తి పెరిగింది. జిల్లా పరిధిలో ఈ ఏడాది 1,934 కేసులు నమోదయ్యాయి. 2024లో జిల్లా పరిధిలో 1207 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 727 కేసులు పెరిగాయి. జిల్లాలో గతేడాది 12 హత్య కేసులు నమోదు కాగా ఈ ఏడాది 10 హత్య కేసులు నమోదయ్యాయి. గత ఏడాది 32 హత్యయత్నాల కేసులు నమోదు కాగా ఈ ఏడాది 31 కేసులు నమోదయ్యాయి. దోపిడీ కేసులు గత ఏడాది ఒక కేసు నమోదైంది. ఈ ఏడాది కూడా ఒక కేసు నమోదయింది. పగటిపూట ఇళ్లల్లో చోరీలు గతేడాది ఒక కేసు నమోదు కాగ ఈ ఏడాది ఐదు కేసులు నమోదయ్యాయి. రాత్రిపూట ఇళ్లల్లో చోరీలు గతేడాది 29 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 53 కేసులు నమోదయ్యాయి. దొంగ తనాల కేసులు గతంలో 50 నమోదు కాగా ఈ ఏ డాది 151 కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులు గతంలో 18 కాగా ఈ ఏడాది 24 నమోద య్యాయి. జిల్లాలో అత్యాచారాలు గత ఏడాది 24 కేసులు నమోదు కాగా ఈ ఏడాది 22 కేసులు నమోదయ్యాయి. సైబర్ నేరాల కేసులు గత ఏడా ది 21 నమోదు కాగా ఈ ఏడాది 37 నమోద య్యాయి. ఎస్సీ, ఎస్టీ కేసులు గత ఏడాది 34 నమోదు కాగా ఈ ఏడాది 38 నమోదయ్యాయి. పోక్సో కేసులు గతేడాది 27 నమోదా కాగా ఈ ఏడాది 18 కేసులు నమోదయ్యాయి. గృహవేధిం పుల కేసులు గతేడాది 99 నమోదు కాగా ఈ ఏడాది 106 నమోదయ్యాయి. జిల్లాలో గంజాయి కేసులు గతేడాది 39 నమోదు కాగా ఈ ఏడాది 73 కేసులు నమోదయ్యాయి. కిడ్నాప్ కేసులు గతేడాది 18 నమోదు కాగా ఈ ఏడాది 24 కేసులు నమోద య్యాయి. చీటింగ్ కేసులు గతేడాది 170 నమోదు కాగా ఈ ఏడాది 197 కేసులు నమోదయ్యాయి. రోడ్డు ప్రమాదాల కేసులు గతేడాది 133 కేసులు కాగా ఈ ఏడాది 267 కేసులు నమోదయ్యాయి. అతివేగం, నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదాల కేసులు ఈ ఏడాది పెరిగాయి. పీడీఎస్ ఆక్రమ రవాణాపై 45 కేసులు, నకిలీ విత్తనాలు, పురుగుల మందుల అక్రమ రవాణాలో 45 కేసులు నమోద య్యాయి. ఈ ఏడాది అన్ని కేసులు కలిపి 46 మందికి శిక్షలు పడేలా చేశారు. లోక్ అదాల త్‌ల ద్వారా 4,118 కేసులు పరిష్కరించారు. గంజా యి రహిత జిల్లాగా తీర్చిదిద్దే లక్ష్యంగా పెద్ద ఎత్తున దాడులు నిర్వహించి 73 కేసులు నమోదు చేసి 12 2 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు
- సామాజిక సేవల్లోనూ..
జిల్లాలో ఈ ఏడాది పోలీసుశాఖ ఆధ్వర్యంలో సామాజికసేవ కార్యక్రమాలను చేపట్టారు. వివిధ పోలీసు స్టేషన్ల వద్ద మొత్తం 3,100 సామాజిక పోలీసింగ్ కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లాలో ఈ ఏడాది ఫిర్యాదుల పరిష్కర దినం ద్వారా మొత్తం 232 పిటిషన్లు స్వీకరించారు. వాటిలో 220 పిటిషన్లు పరిష్కరించారు. జిల్లాలో గ్రామ పోలీసు అధికారి వ్యవస్థను బలోపేతం చేశారు. జిల్లాలో 278 గ్రామ పోలీసు అధికారులు ఉండగా వారు 868 గ్రామాలను సందర్శించారు. నేరాల నియంత్ర ణకు బీట్ వ్యవస్థ, పాయింట్ పుస్తకాల ఏర్పాటు చేశారు. జిల్లాలోని ప్రతి పోలీసు స్టేషన్ పరిధిలో పోలీసింగ్‌పై కళాజాతా బృందాలచేత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థులకు ప్యాడ్లు, పెన్నులు, స్పోర్ట్స్ కిట్లు, దివ్యాంగులకు వీల్ చైర్‌లు, మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లను, నిరుపేద లకు నిత్యావసర సరుకులు, దుప్పట్లు, రగ్గులు పంపిణీ చేశారు. హెల్త్ క్యాంపులను నిర్వహించి ఉచితంగా మందులను అందజేశారు. జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో రక్తదాన శిబిరం నిర్వహిం చారు. 143 మంది పోలీసు సిబ్బంది 143 యూనిట్ల రక్తం అందజేశారు. షీటీంల ద్వారా మ హిళలపై నేరాలు, మహిళల కోసం ఉన్న చట్టాలు వంటి అం శాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. భరోసా కేంద్రం ద్వారా వచ్చిన ఫిర్యాదులను స్వీకరించి బాధితులకు అండగా నిలు స్తున్నారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్‌లో బాల కార్మికులు, బడిఈడు పిల్లలను గుర్తించి వారిని విముక్తులను చేస్తున్నారు.