Share News

అసంపూర్తిగా ఆరోగ్య ఉపకేంద్రం

ABN , Publish Date - Aug 21 , 2025 | 12:42 AM

నార్కట్‌పల్లి మండల కేంద్రం లో సబ్‌సెంటర్‌ (ఆరోగ్య ఉపకేంద్రం) భవనం నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ఈ భవనాన్ని ని ర్మిస్తున్నారు.

 అసంపూర్తిగా ఆరోగ్య ఉపకేంద్రం
నార్కట్‌పల్లిలో అసంపూర్తిగా ఉన్న సబ్‌సెంటర్‌ భవనం

అసంపూర్తిగా ఆరోగ్య ఉపకేంద్రం

భవనం పూర్తికి రూ.8లక్షలు కావాలట..!

ప్రతిపాదనలు పంపిన పీఆర్‌ అధికారులు

రెండేళ్లయినా మంజూరు కాని నిధులు

నార్కట్‌పల్లి, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): నార్కట్‌పల్లి మండల కేంద్రం లో సబ్‌సెంటర్‌ (ఆరోగ్య ఉపకేంద్రం) భవనం నిర్మాణ పనులు అసంపూర్తిగా నిలిచాయి. 15వ ఆర్థిక సంఘం నిధుల కింద ఈ భవనాన్ని ని ర్మిస్తున్నారు. 2023లో జూన 14వ తేదీన అప్పటి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సుమారు రూ. 26లక్షల అంచనా వ్యయంతో నిర్మాణ పనులు మొదలు పెట్టారు. ఇం దుకు గాను పార్ట్‌-ఏ కింద మొదటి విడత రూ.20లక్షలు మంజూరయ్యాయి. పార్ట్‌-బీ కింద మరో రూ.6లక్షలు మంజూరు కావాల్సి ఉంది. దీంతో భవన నిర్మాణ పనులు పొందిన కాంట్రాక్టర్‌ పార్ట్‌-ఏ మొదటి ద ఫా కింద మంజూరైన నిధుల మేరకు భవన నిర్మాణ పనులను చేపట్టా రు. ఇందులో భాగంగా హాల్‌, డాక్టర్‌, నర్సు రూం, ప్రసూతి గదిలను నిర్మించారు.

పార్ట్‌-బీ నిధులు విడుదలైతేనే

భవన నిర్మాణం పూర్తికావాలంటే పార్ట్‌-బీ నిధులు రూ.6 లక్షలు వి డుదల కావాల్సి ఉంది. ఈ నిధులు విడుదలైతే తప్ప భవనానికి దర్వాజలు, కిటికీలు, ప్లాస్టరింగ్‌, ఎలక్ర్టిఫికేషన, శానిటేషన, పెయింటింగ్‌ చే యాల్సి ఉంది. వీటిని చేపట్టాలంటే ఈ నిధులు మంజూరు కావాలి. కా నీ ఏడాదిగా నిధులు మంజూరు కాకపోవడంతో సబ్‌ సెంటర్‌ భవనం అసంపూర్తిగా మారింది. ఫలితంగా కిటికీలు బిగించని భవనం లోపలికి కొందరు ఆకతాయిలు దూకి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

భవన నిర్మాణాన్ని పూర్తిచేయాలి

అసంపూర్తిగా ఉన్న భవనాన్ని త్వరితగతిన పూర్తిచేయాలి. ఆరో గ్య కేంద్రం సేవలు ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులోకి తీసుకు రావాలి. భవనం పూర్తి ఆలస్యమైనా కొద్దీ అంచనా నిధులు కూడా పెరుగుతాయి. ఇందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం తక్షణమే మంజూరు చేయాలి.

- నడింపల్లి నరేష్‌, స్థానికుడు

రూ.8లక్షలకు ప్రతిపాదనలు పంపాం

నార్కట్‌పల్లిలో సత్రం బడి వద్ద అసంపూర్తిగా నిలిచిన సబ్‌ సెంటర్‌ భవనం నిర్మాణ పనులు పూర్తి చేయడానికి కావాల్సిన రూ.8లక్షల నిధుల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. భవనానికి కిటికీలు, ప్లాస్టరింగ్‌, శానిటేషన, విద్యుదీకరణ, ఫ్లోరింగ్‌ పనులు చేయాల్సి ఉంది. నిధులు విడుదలైన వెంటనే పనులు ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం.

- భరతచంద్ర, పీఆర్‌ ఏఈ, నార్కట్‌పల్లి

Updated Date - Aug 21 , 2025 | 12:42 AM