Share News

kumaram bheem asifabad-కలిసిరాని కాలం

ABN , Publish Date - Dec 26 , 2025 | 10:16 PM

కాల ప్రవాహంలో మరో ఏడాది కలిసిపోతోంది. కొత్త ఏడాదికి కోటి ఆశలతో స్వాగతం చెప్పేందుకు ప్రజలు సిద్ధమతున్నారు. ఈ యేడు రాజకీయంగా, అభివృద్ధి పరంగా పలు సంఘటనలు జరిగాయి. వీటిని ఒకసారి ‘యాది’ చేసుకుందాం.. ఈ ఏడాది పలు రంగాల్లో జరిగిన సంఘటనలు, ఆసక్తికర పరి ణామాలను ‘ఆంధ్రజ్యోతి’ మీకు అందిస్తోంది.

kumaram bheem asifabad-కలిసిరాని కాలం
లోగో

- ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయిన రైతులు

- అధిక వర్షాలతో వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంట

- మొంథా తుఫాన్‌ తాకిడికి కుదేలైన అన్నాదాతలు

- పంట దిగుబడి రాదన్న దిగులుతో నలుగురు రైతుల బలవన్మరణం

కాల ప్రవాహంలో మరో ఏడాది కలిసిపోతోంది. కొత్త ఏడాదికి కోటి ఆశలతో స్వాగతం చెప్పేందుకు ప్రజలు సిద్ధమతున్నారు. ఈ యేడు రాజకీయంగా, అభివృద్ధి పరంగా పలు సంఘటనలు జరిగాయి. వీటిని ఒకసారి ‘యాది’ చేసుకుందాం.. ఈ ఏడాది పలు రంగాల్లో జరిగిన సంఘటనలు, ఆసక్తికర పరి ణామాలను ‘ఆంధ్రజ్యోతి’ మీకు అందిస్తోంది.

ఆసిఫాబాద్‌, డిసెంబరు 26 (ఆంధ్రజ్యోతి): ఆరుగా లం శ్రమించే రైతున్నకు ఏటేటా కష్టాలు తప్పడం లేదు. ప్రకృతి వైపరీత్యాలకు రైతన్నలు విలవిలలాడుతున్నారు. గిట్టుబాటు ధర లభించక పోవడంతో రైతాంగం తీవ్రంగా నష్ట పోవాల్సి వస్తోంది. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ ఏడాది వానాకా లం సీజన్‌ ప్రారంభంలో విత్తనాలు విత్తిన రైతన్నలు పం టల దిగుబడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈసారైన పంటలు ఆశించిన స్థాయిలో పండుతా యని భావించిన రైతాంగానికి తీవ్ర నిరాశే ఎదురైంది. ఎకదాటిగా వర్షాలు కురువడంతో వేసిన పంటలు ఎదుగుదల లేక రైతన్నలు దిగాలు చెందారు.

- జిల్లాలో సాగు ఇలా..

జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో 4,45,049 ఎకరా ల్లో వివిధ రకాల పంటలు సాగవుతున్నాయి. ఇందు లో పత్తి 3,35,363 ఎకరాలు, వరి పంట 56,861 ఎకరాల్లో కంది పంట 30,430 సాగవుతోంది. మొక్క జొన్న, జొన్న, పెసర, మినుములు, సోయాబీన్‌, మి రప, వేరుశెనగ, ఆముదాలు, నువ్వులు 22,395 ఎకరాలలో పంటలను రైతులు సాగు చేశారు. జిల్లాలో ఏటా రైతులు పత్తిపంట వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ ఏడాది ఆధిక వర్షాల కారణంగా పత్తిపంట సాగు చేసిన రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లింది.

- వరదలతో అవస్థలు..

వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు కళకళళాడుతా న్నాయని సంతోషంలో ఉన్న రైతులకు భారీ వర్షాలు, వరదలు, మొంథా తుఫాన్‌ ముంచేత్తడంతో రైతుల ఆశలు అవిరయ్యాయి. జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురిసిన వర్షాలకు పెనుగంగా, ప్రాణహిత, పెద్దవాగు ఉగ్ర రూపం దాల్చి అతలాకుతలం చేశాయి. జిల్లాలోని పెనుగంగా, ప్రాణహిత, పెద్దవాగు సరిహద్దు పరివాహక మండలాలైన కౌటాల. చింతలమానేపలి, బెజ్జూర్‌. పెంచికలపేట్‌, దహెగాం మండలాల్లో వేల ఎకారాలలో పంట నష్టం వాటిల్లింది. వరదల కార ణంగా పంట పొలాలు వరద నీటిలో మునిగి పో యాయి. కొన్ని చోట్ల ఇసుక మేటలు వేయగా మరికొ న్ని చోట్ల పంటలు కొట్టుకుపోయి ఎడారిలా మారా యి. సిర్పూర్‌ నియోజక వర్గంలో ఏటా వర్షాకాలంలో ప్రాణహిత, పెనుగంగా,పెద్దవాగు పరీవాహక ప్రాం తాల్లో వరదలు పంటలను ముంచెత్తుతునే ఉంటా యి. మహరాష్ట్రలో వర్షాలు కురిసినా అక్కడి ప్రాజెక్టు ల నీటిని వదిలిన ప్రాణహిత పరీవాహక మండలాల్లో తీవ్ర పంట నష్టం జరుగుతోంది. దీంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. నాలుగైదేళ్లుగా పంటలు నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారం అంద డం లేదు. జిల్లాలో కురిసిన బారీ వర్షాలతో పాటు మొంథా తుఫాన్‌ ప్రభావంతో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జిల్లాలో పెద్ద ఎత్తున పత్తి పంటను సాగు చేసిన రైతులను అధిక వర్షాలు తీవ్రంగా నష్టానికి గురి చేశాయి. జిల్లాలో కురిసిన వర్షాలకు పదివేల ఎకరాలలో పత్తి పంటకు నష్టం వాటిల్లింది.

- యూరియా కష్టాలు..

ఆరుగాలం శ్రమించే రైతన్నకు జిల్లాలో వానాకాలం సీజన్‌ పంటల సాగుకు యూరియా సకాలంలో లభించక అనేక అవస్థలు పడ్డారు. జిల్లాలోని అన్ని మండలాల్లో యూరియా కోసం రైతులు బారులు తీరారు. రైతు వేదికలు, ప్రాథమిక వ్యవసాయ సహ కార కార్యాలయం వద్ద యూరియా కోసం ఉదయం ఏడు గంటలకే వరస కట్టి, వృద్ధులు, చంటి పాపల తల్లులు, మహిళ రైతులు యూరియా కోసం బారులు తీరాల్సి వచ్చింది. యూరియా కోసం రైతులు ఆందోళ నలు, రాస్తారోకోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసు బందోబస్తు మధ్య యూరియా పంపిణీ చేయాల్సిన ఇబ్బందులు తలెత్తాయి.

- దిగుబడిపై దిగులు..

జిల్లాలో పత్తి రైతులు ఈ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో దిగులు చెందారు. ఆధిక వర్షాలతో ఆశించిన స్థాయిలో పంట ఎదుగుదల లేక పోవడం, పంట చేతికి వచ్చే సమయంలో మొంథా తుపాన్‌తో పత్తి నేలరాలిపోవడంతో రైతన్న లు ఆందోళనకు గురైయ్యారు. జిల్లాలోని ఈ సీజన్‌లో 3.35లక్షల ఏకరాలలో పత్తి పంట సాగు చేయగా 38 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భిన్నంగా ఏకరానికి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావల్సి ఉండగా వర్షాలు, వరదలు, తుఫాన్‌ ప్రభావంతో పంటలు దెబ్బతిన్నా యి. దీంతో ఏకరానికి నాలుుగు నుంచి ఎనిమిది క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. చేతికి వచ్చిన పంటను అమ్మడానికి సిద్ధమైన రైతులకు సీసీఐ నిబంధనలు మరింత నష్టాల్లోకి నెట్టింది. పత్తి కోనుగోళ్లకు సీసీఐ పరిమితులు విధించింది. గతేడాది వరకు ఎకరానికి 12 క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసిన సీసీఐ ఈ ఏడు ఐదు క్వింటాళ్లు తగ్గించి కొనుగోలు చేస్తోంది. అది కూడా కపాస్‌ కిసాన్‌ యాప్‌లో ముందుగా స్లాట్‌ బు క్‌ చేసి పత్తిని విక్రయించాలనే నిబంధనలు పెట్టింది. దీంతో రైతులు తీవ్రంగా నష్ట పోతున్నారు. ఏటేటా పత్తి పంట సాగుకు ఖర్చులు పెరుగుతున్నా రైతన్నలకు మాత్రం గిట్టుబాటు ధర పెరగడం లేదు. పత్తి చేలలో కలుపుతీత, పత్తి ఏరివేత పనులు నిర్వహిం చేందుకు కూలీలకు చాలా డిమాండ్‌ ఉంది. ఇక్కడ కూలీలు దొరకకపోవడంతో మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ ప్రాంతాల నుంచి కూలీలను తీసుకు వచ్చి వారికి అన్ని సౌకర్యాలు కల్పించాల్సిన పరిస్థితులు ఉన్నాయి.

- పంట కోల్పోయిన దిగులుతో..

అధిక వర్షాలకు పంట దెబ్బతిన్నదన్న దిగులుతో నలుగురు రైతులు బలవన్మరణానికి పాల్ప డ్డారు. పంట దిగుబడి దిగాలుతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. లింగాపూర్‌ మండలం లోని సీతారాంనాయక్‌ తండా గ్రామానికి చెందిన జాదవ్‌ బలిరాం(59), సిర్పూర్‌(టి) మండలం చింత కుంట గ్రామానికి చెందిన పిట్టల కిష్టయ్య (65), వాంకిడి మండల కేంద్రానికి చెందిన బుట్లే సుధాకర్‌ (34) మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆసిఫాబాద్‌ మండలంలోని ఈదులవాడ గ్రామానికి చెందిన ఉప్పరి లచ్చయ్య (58)పత్తి పంట దిగుబడి రాక పోవడంతో మనస్తా పం చెంది తన పంట చేనులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నష్టపోయిన పంటలకు ఎకరానికి రూ.10వేలు చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పినా ఆచరణకు నోచుకోలేదు.

- అందని రైతు భరోసా..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో పెట్టుబడి సహాయంగా రైతుబంధు పథకం కింద ఎకరానికి రూ. ఐదు వేల చొప్పున వానకాలం యాసంగి సీజన్‌లలో రైతుల ఖాతాల్లో జమ చేసేది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి రూ. 7500 చొప్పున రెండు విడతల్లో చెల్లిస్తామని హామీ ఇచ్చింది. కానీ నిధుల కొరత కారణంగా గత యాసంగి నుంచి పెట్టుబడి సాయాన్ని ఎకరాకు రూ.6,000 మాత్రమే అందిస్తోంది. జిల్లాలో 1,43,000 మంది రైతులు ఉన్నా రు. డిసెంబరు ముగిసెందుకు వస్తున్నా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం నేటికి అందలేదు. కానీ ప్రభుత్వం సంక్రాంతికి రైతు భరోసా అందిస్తామని ప్రకటించడం రైతులకు ఊరటనిస్తోంది.

Updated Date - Dec 26 , 2025 | 10:16 PM