Share News

kumaram bheem asifabad- ఎడ తెరిపి లేని వర్షం

ABN , Publish Date - Jul 24 , 2025 | 10:46 PM

చింతలమానేపల్లి మండల వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసిన వర్షానికి దిందా-కేతిని గ్రామాల మధ్య వాగు ఉప్పొంగి ప్రవహించడంతో దిందా గ్రామ వాసులకు రాక పోకలు నిలిచి పోయాయి. అలాగే శివపల్లి వాగు, బాబాసాగర్‌, నాయకపుగూడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయినప్పటికీ గ్రామస్థులు ప్రమాదకంగా వాగు గుండా ఎడ్లబండిపై దాటారు.

kumaram bheem asifabad- ఎడ తెరిపి లేని వర్షం

చింతలమానేపల్లి/బెజ్జూరు/కెరమెరి/దహెగాం/పెంచికలపేట, జూలై 24 (ఆంధ్రజ్యోతి): చింతలమానేపల్లి మండల వ్యాప్తంగా ఎడ తెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకదాటిగా కురిసిన వర్షానికి దిందా-కేతిని గ్రామాల మధ్య వాగు ఉప్పొంగి ప్రవహించడంతో దిందా గ్రామ వాసులకు రాక పోకలు నిలిచి పోయాయి. అలాగే శివపల్లి వాగు, బాబాసాగర్‌, నాయకపుగూడ వాగు ఉప్పొంగి ప్రవహిస్తుంది. అయినప్పటికీ గ్రామస్థులు ప్రమాదకంగా వాగు గుండా ఎడ్లబండిపై దాటారు. మండల కేంద్రంలోని పలువురి ఇళ్లలోకి వరద నీరు చేరింది. కార్యదర్శి ఆసీఫ్‌ ఆలీ ఆధ్వర్యంలో నీటిని మళ్లించారు. అలాగే పంట పొలాలు, చేనులలో రోడ్లపై వరద నీరు పారింది. దిందా వాగు ఉధృతిని గురువారం కాగజ్‌నగర్‌ సబ్‌ కలెక్టర్‌ శ్రద్దశుక్లా పరిశీలించారు. ఆమె వెంట తహసీల్దార్‌ దౌలత్‌, పోలీసు, రెవెన్యూ సిబ్బంది ఉన్నారు. బెజ్జూరు మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడ తెరిపి లేకుండా ముసురు వాన కురుస్తోంది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులకు ఆటంకం కలిగింది. : కెరమెరి మండల వ్యాప్తంగా బుధవారం రాత్రి నుంచి ముసురు వర్షం కురిసింది. దీంతో రైతులు తమ వ్యవసాయ పనులు చేయడానికి వీలు లేకుండా పోయింది. అలాగే లక్మాపూర్‌ వాగు పొంగడంతో పలు గ్రామాల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దహెగాం మండల వ్యాప్తంగా గురువారం ముసురు వర్షం కురిసింది. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు ఇంటికే పరిమితమయ్యారు. పెంచికలపేట మండలంలో గురువారం ఉదయం నుంచి ఎడ తెరిపి లేకుండా ముసురు వాన కురుస్తోంది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఉచ్చమల్లవాగు, పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఆగర్‌గూడ గ్రామంలోని తాళ్ల దేవాజీ ఇంటి గోడలు కూలి పోయాయి.

Updated Date - Jul 24 , 2025 | 10:46 PM