అంబేద్కర్‌పై అనుచిత వాఖ్యలు సరికాదు
ABN , Publish Date - Apr 09 , 2025 | 11:28 PM
భార త రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్‌పై హోం మంత్రి అమిత్‌షాతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు అనుచిత వాఖ్యలు చేయడం సరికాదని, దీనిని దేశ ప్రజలు క్షమించరని పెద్దపల్లి ఎంపీ గ డ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వా మి పేర్కొన్నారు.

రాష్ట్రంలో అంబేద్కర్ స్పూర్తితో ప్రజా పాలన
మందమర్రి టౌన్, ఏప్రిల్ 9(ఆంధ్రజ్యోతి) : భార త రాజ్యాంగ నిర్మాత డా. బీఆర్ అంబేద్కర్‌పై హోం మంత్రి అమిత్‌షాతో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నాయకులు అనుచిత వాఖ్యలు చేయడం సరికాదని, దీనిని దేశ ప్రజలు క్షమించరని పెద్దపల్లి ఎంపీ గ డ్డం వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వా మి పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇచ్చిన ఆదేశాల మేరకు బుధవారం మందమర్రిలో నిర్వ హించిన రాజ్యాంగ పరిరక్షణ యాత్రకు ముఖ్య అతి థిగా హాజరయ్యారు. పాత బస్టాండ్‌లో గాంధీ విగ్ర హానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అ నంతరం యాత్ర ఆయా కాలనీల మీదుగా చేపట్టా రు. జై భీం నినాదాలతో అంబేద్కర్‌తో పాటు గాంధీ, రాజ్యాంగ పుస్తకం చేత పట్టుకొని ఈ ర్యాలీ కొనసా గించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మూడో సారి అధికారంలోకి వచ్చిన మోదీప్రభుత్వం రాజ్యాంగ తిలోదకాలు ఇస్తూ ఇష్టారాజ్యంగా వ్యవహ రిస్తుందని మండిపడ్డారు. అంబేద్కర్ లేకపోతే దేశం లో ప్రజాస్వామ్య పార్లమెంటరీ వ్యవస్థ ఏర్పడేదా అ ని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యాంగ పరి ర క్షణ యాత్ర మందమర్రి కోఆర్డినేటర్ అంజన్‌కు మా ర్‌తో పాటు జిల్లా, పట్టణ నాయకులు నోముల ఉ పేందర్, సొత్కు సుదర్శన్, రమేష్, లక్ష్మణ్, రజిణి, నెర్వెట్ల శ్రీనివాస్, సంగి సదానందం, మండ భాస్కర్, రాచర్ల రవి, సట్ల సంతోష్, ఆకారం రమేష్, గణేష్, పాల్గొన్నారు.
కాంగ్రెస్ నాయకుల పాదయాత్ర
నస్పూర్ : విలేజ్ నస్పూర్ బుధవారం కాంగ్రెస్ పార్టీ నాయ కులు జై బాపు, జై బీమ్, జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఇన్‌చార్జి నూకల రమేష్, మాజీ మున్సిపల్ చైర్మన్ సుర్మిళ్ల వేణు, యువజన కాంగ్రెస్ జిల్లా మాజీ అద్యక్షుడు సంపత్ రెడ్డిలతో పాటు వివిధ వార్డులకు చెందిన మాజీ కౌన్సిలర్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, మహిళ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.