Share News

మంచిర్యాల కార్పొరేషన్‌లో.. ఎగిరేది కాషాయ జెండానే

ABN , Publish Date - Dec 31 , 2025 | 11:26 PM

త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్‌లో ఎగిరేది కాషాయ జెండానేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాల యంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.

మంచిర్యాల కార్పొరేషన్‌లో..  ఎగిరేది కాషాయ జెండానే

మంచిర్యాల కలెక్టరేట్‌, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : త్వరలో జరిగే మున్సిపల్‌ ఎన్నికల్లో మంచిర్యాల కార్పొరేషన్‌లో ఎగిరేది కాషాయ జెండానేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాధ్‌ వెరబెల్లి పేర్కొన్నారు. బుధవారం పార్టీ కార్యాల యంలో నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్‌ ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచేది బీజేపీయేనని తెలిపారు. రెండేళ్ల కాంగ్రెస్‌ పాలనలో మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఎక్క డి సమస్యలు అక్కడే ఉన్నాయన్నారు. శాశ్వత డంపింగ్‌యార్డు లేక వార్డుల్లో చెత్త పేరుకుపోతుందని.. వరద ముంపు ప్రాంతా లకు శాశ్వత పరిష్కారం చూపలేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందన్నారు. మంచిర్యాల మున్సిపల్‌ కార్పోరేషన్‌ను బీజేపీ పార్టీ కైవసం చేసుకోవడం ఖాయమని, ఇందుకు నాయకులు, కార్యకర్తలు అంకిత భావంతో కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌, నాయకులు గాజుల ముకేష్‌గౌడ్‌, అమిరిశెట్టి రాజ్‌కుమార్‌, రమేష్‌,చక్రవర్తి, శ్రీశైలం, వెంకటేశ్వర్‌రావు, కృష్ణమూర్తి, తిరుపతి, సతీష్‌రావు, శ్రీదేవి, కమలాకర్‌రావు, అశోక్‌వర్ధన్‌, రఘునందన్‌, శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 31 , 2025 | 11:27 PM